Breaking News

మనదే ఆసియా కప్‌

Published on Mon, 09/08/2025 - 01:16

రాజ్‌గిర్‌ (బిహార్‌): మ్యాచ్‌ మ్యాచ్‌కూ రాటుదేలిన భారత పురుషుల హాకీ జట్టు అసలు సిసలు సమరంలోనూ తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. సొంతగడ్డపై జరిగిన ఆసియా కప్‌ టోర్నీలో హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ నాయకత్వంలోని భారత జట్టు చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత జట్టు 4–1 గోల్స్‌ తేడాతో డిఫెండింగ్‌ చాంపియన్‌ దక్షిణ కొరియా జట్టును ఓడించింది. 

ఈ విజయంతో ఆసియా కప్‌ విజేత హోదాలో... భారత జట్టు వచ్చే ఏడాది ఆగస్టులో బెల్జియం–నెదర్లాండ్స్‌లో జరిగే ప్రపంచ కప్‌ టోర్నీకి నేరుగా అర్హత సాధించింది. కొరియాతో జరిగిన ఫైనల్లో భారత్‌ తరఫున దిల్‌ప్రీత్‌ సింగ్‌ (28వ, 45వ నిమిషాల్లో) రెండు గోల్స్‌ చేయగా... సుఖ్‌జీత్‌ సింగ్‌ (1వ నిమిషంలో), అమిత్‌ రోహిదాస్‌ (50వ నిమిషంలో) ఒక్కో గోల్‌ సాధించారు. కొరియా జట్టుకు డెయిన్‌ సన్‌ (51వ నిమిషంలో) ఏకైక గోల్‌ అందించాడు.

 విజేతగా నిలిచిన భారత జట్టుకు హాకీ ఇండియా నజరానా ప్రకటించింది. జట్టులోని ప్రతి సభ్యుడికి రూ. 3 లక్షల చొప్పున... సహాయక సిబ్బందికి రూ. 1 లక్ష 50 వేల చొప్పున నగదు పురస్కారం అందజేయనుంది.  ఆసియా కప్‌ను అత్యధికంగా ఐదుసార్లు నెగ్గిన కొరియా జట్టును ఏమాత్రం తక్కువ అంచనా వేయకుండా ఫైనల్లో భారత్‌ పక్కా వ్యూహంతో ఆడింది. 

తొలి నిమిషం నుంచే సమన్వయంతో కదులుతూ దాడులు చేసింది. ఫలితంగా తొలి నిమిషంలోనే భారత్‌ ఖాతా తెరిచింది. ఆ తర్వాత భారత్‌ జోరు కొనసాగించగా... ఆతిథ్య జట్టు దాడులను అడ్డుకోవడంలోనే కొరియాకు సమయం సరిపోయింది. మ్యాచ్‌ మొత్తం భారత్‌ ఒకేతీరుగా ఆడటంతో కొరియాకు తేరుకునే అవకాశం లేకుండా పోయింది. 

నాలుగు గోల్స్‌ సమర్పించుకున్నాక కొరియా ఖాతా తెరిచినా అప్పటికే ఆలస్యమైపోయింది. మ్యాచ్‌ మొత్తంలో భారత్‌కు రెండు పెనాల్టీ కార్నర్‌లు రాగా ఒక దానిని సద్వినియోగం చేసుకుంది. ఒక పెనాల్టీ స్ట్రోక్‌ను వృథా చేసింది. కొరియా జట్టుకు లభించిన మూడు పెనాల్టీ కార్నర్‌లలో ఒక దానిని గోల్‌గా మలిచింది. అంతకుముందు మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో మలేసియా 4–1తో చైనాపై గెలిచింది.

4: ఆసియా కప్‌ టైటిల్‌ సాధించడం భారత్‌కిది నాలుగోసారి. గతంలో భారత్‌ 2003, 2007, 2017లలో విజేతగా నిలిచింది. కొరియా అత్యధికంగా ఐదుసార్లు ఆసియా కప్‌ విజేతగా నిలిచింది.

164: తాజా ఆసియా కప్‌లో నమోదైన మొత్తం గోల్స్‌. ఇందులో 97 ఫీల్డ్‌ గోల్స్‌ కాగా... 59 పెనాల్టీ కార్నర్‌ల ద్వారా, 8 పెనాల్టీ స్ట్రోక్‌ల ద్వారా వచ్చాయి. మలేసియా ప్లేయర్‌ అఖీముల్లా 12 గోల్స్‌తో టోర్నీ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. భారత్‌ తరఫున అభిõÙక్, హర్మన్‌ప్రీత్, సుఖ్‌జీత్‌ 6 గోల్స్‌ చొప్పున చేశారు.

39:  తాజా ఆసియా కప్‌లో అత్యధిక గోల్స్‌ చేసిన జట్టుగా భారత్‌ (39) నిలిచింది. ఈ టోర్నీలో భారత్‌ ఆరు మ్యాచ్‌ల్లో గెలిచి, ఒక మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచింది. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)