Breaking News

భారత ఖోఖో సారథులు ప్రతీక్, ప్రియాంక

Published on Fri, 01/10/2025 - 04:35

న్యూఢిల్లీ: గ్రామీణ క్రీడ ఖోఖోలో మొట్టమొదటి సారిగా జరగబోతున్న ప్రపంచకప్‌ మెగా ఈవెంట్‌కు భారత జట్లను ఎంపిక చేశారు. సందర్భంగా భారత ఖోఖో సమాఖ్య (కేకేఎఫ్‌ఐ) అధ్యక్షుడు సుధాన్షు మిట్టల్, మెగా ఈవెంట్‌ సీఈఓ మేజర్‌ జనరల్‌ విక్రమ్‌ దేవ్‌ డోగ్రా టీమ్‌ జెర్సీలను ఆవిష్కరించారు. ఇందులో ఇండియా టీమ్‌ అని కాకుండా ‘భారత్‌ కి టీమ్‌’ అని ఉండటం విశేషం. 

జెర్సీపై భారత్‌ లోగోను ప్రముఖంగా హైలైట్‌ చేశారు. కేకేఎఫ్‌ఐ సెలక్టర్లు ఇరుజట్లను గురువారం ప్రకటించారు. పురుషుల జట్టుకు ప్రతీక్‌ వాయ్‌కర్, మహిళల జట్టుకు ప్రియాంక ఇంగ్లే సారథులుగా వ్యవహరిస్తారు. ప్రియాంక బృందానికి సుమిత్‌ భాటియా, ప్రతీక్‌ జట్టుకు అశ్వని కుమార్‌ హెడ్‌ కోచ్‌లుగా మార్గదర్శనం చేస్తారు.  

ఆంధ్ర ప్లేయర్‌ శివా రెడ్డికి చోటు 
ప్రపంచకప్‌లో పాల్గొనే భారత పురుషుల జట్టులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పోతిరెడ్డి శివా రెడ్డికి స్థానం లభించింది. ప్రకాశం జిల్లా ఈదర గ్రామానికి చెందిన 26 ఏళ్ల శివా రెడ్డి అల్టిమేట్‌ ఖోఖో లీగ్‌లో ముంబై ఖిలాడీస్, గుజరాత్‌ జెయింట్స్‌ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.  

రెండు వేదికల్లో... 
ఖోఖో ప్రపంచకప్‌ మ్యాచ్‌లను ఇందిరాగాంధీ ఇండోర్‌ స్టేడియంలో, గ్రేటర్‌ నోయిడా స్టేడియంలో  ఈ నెల 13 నుంచి 19 వరకు నిర్వహిస్తారు. తొలిరోజు 13న పురుషుల జట్టు నేపాల్‌తో తలపడుతుంది. 

మరుసటి రోజు (14న) మహిళల జట్టు తమ తొలి మ్యాచ్‌లో కొరియాను ఢీకొంటుంది. 24 దేశాలకు చెందిన జట్లు ఈ తొలి ప్రపంచకప్‌లో పాల్గొంటున్నాయి. 16వ తేదీ వరకు లీగ్‌ దశ మ్యాచ్‌లు జరుగుతాయి. 17న క్వార్టర్‌ ఫైనల్స్, 18న సెమీస్, 19న జరిగే టైటిల్‌ పోటీలతో మెగా ఈవెంట్‌కు తెరపడుతుంది. 

భారత ఖోఖో జట్ల వివరాలు 
పురుషుల జట్టు: ప్రతీక్‌ (కెప్టెన్‌), పబని సబర్, మేహుల్, సచిన్‌ భార్గో, సుయశ్, రామ్‌జీ కశ్యప్, పోతిరెడ్డి శివా రెడ్డి, ఆదిత్య గాన్పులే, గౌతమ్, నిఖిల్, ఆకాశ్‌ కుమార్, సుబ్రమణి, సుమన్‌ బర్మన్, అనికేత్‌ పోటే, రాకేషన్‌ సింగ్‌. 
మహిళల జట్టు: ప్రియాంక ఇంగ్లే (కెప్టెన్‌), అశ్విని, రేష్మ రాథోడ్, బిలార్‌ దేవ్‌జీభాయ్, నిర్మలా, నీతా    దేవి, చైత్ర, శుభశ్రీ సింగ్, మాంగయ్‌ మజీ, అన్షు కుమారి, వైష్ణవి, నస్రీన్, మీనూ, మోనిక, నజియా.  

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)