Breaking News

యువ భారత్‌ శుభారంభం

Published on Sun, 10/12/2025 - 04:20

జొహర్‌ బహ్రు (మలేసియా): భారత జూనియర్‌ పురుషుల హాకీ జట్టు... సుల్తాన్‌ ఆఫ్‌ జొహర్‌ కప్‌లో శుభారంభం చేసింది. టోర్నీలో భాగంగా శనివారం జరిగిన పోరులో రోహిత్‌ సారథ్యంలోని యువ భారత జట్టు 3–2 గోల్స్‌ తేడాతో గ్రేట్‌ బ్రిటన్‌ను చిత్తుచేసింది. కెప్టెన్‌ రోహిత్‌ (45వ, 52వ నిమిషాల్లో) రెండు గోల్స్‌తో విజృంభించగా... రణ్‌వీత్‌ సింగ్‌ (23వ నిమిషంలో) ఓ గోల్‌ సాధించాడు. గ్రేట్‌ బ్రిటన్‌ తరఫున మైఖేల్‌ రొయ్‌డెన్‌ (26వ నిమిషంలో), కాడెన్‌ డ్రాసే (46వ నిమిషంలో) ఒక్కో గోల్‌ చేశారు. 

తొలి క్వార్టర్‌లో ఇరు జట్లు హోరాహోరీగా పోరాడగా... ఏ జట్టూ ఖాతా తెరవలేకపోయింది. మ్యాచ్‌ 13వ నిమిషంలో భారత జట్టుకు తొలి పెనాల్టీ కార్నర్‌ అవకాశం రాగా... దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. 16వ నిమిషంలో వచ్చిన మరో అవకాశాన్ని కూడా గోల్‌గా మలచలేకపోయింది. రెండో క్వార్టర్‌ మధ్యలో గుర్‌జ్యోత్‌ సింగ్‌ ప్రత్యర్థులను బోల్తా కొట్టిస్తూ బంతిని రణ్‌వీత్‌కు అందించగా... అతడు దాన్ని గోల్‌పోస్ట్‌లోకి పంపి భారత్‌కు మొదటి గోల్‌ అందించాడు. 

కాసేపటికే ఇంగ్లండ్‌ స్కోరు సమం చేయగా... మూడో క్వార్టర్‌లోనూ ఇరు జట్లు గోల్స్‌ కోసం తీవ్రంగా శ్రమించాయి. 45వ నిమిషంలో బ్రిటన్‌ స్ట్రయికర్లు చేసిన ప్రయత్నాల్ని భారత గోల్‌కీపర్‌ ప్రిన్స్‌దీప్‌ సింగ్‌ సమర్థవంతంగా అడుకున్నాడు. అదే సమయంలో రోహిత్‌ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచడంతో భారత్‌ ఆధిక్యం రెట్టింపు కాగా... తర్వాతి నిమిషంలోనే పెనాల్టీ స్ట్రోక్‌ను వినియోగించుకున్న గ్రేట్‌ బ్రిటన్‌ స్కోరును మరోసారి సమం చేసింది. 

ఇక చివరి క్వార్టర్‌లో వరుసగా మూడు పెనాల్టీ కార్నర్‌ అవకాశాలు దక్కించుకున్న భారత్‌... మూడోదాన్ని గోల్‌గా మలచి విజయంతో మ్యాచ్‌ను ముగించింది. టోర్నీలో భాగంగా ఆదివారం న్యూజిలాండ్‌తో భారత్‌ తలపడనుంది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)