Breaking News

రెండో సీడ్‌ జోడీకి యూకీ బాంబ్రీ ద్వయం షాక్‌

Published on Thu, 03/13/2025 - 03:52

కాలిఫోర్నియా: తన కెరీర్‌లో ఆడుతున్న తొలి మాస్టర్స్‌ సిరీస్‌ టెన్నిస్‌ టోర్నీలో భారత డబుల్స్‌ స్టార్‌ యూకీ బాంబ్రీ జోరు కొనసాగుతోంది. ఇండియన్‌ వెల్స్‌ మాస్టర్స్‌–1000 సిరీస్‌ టోర్నీలో యూకీ బాంబ్రీ (భారత్‌)–ఆండ్రీ గొరాన్సన్‌ (స్వీడన్‌) ద్వయం క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో యూకీ–గొరాన్సన్‌ జంట 6–2, 5–7, 10–5తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో రెండో సీడ్, ప్రపంచ మూడో, నాలుగో ర్యాంకుల్లో ఉన్న హెన్రీ ప్యాటెన్‌ (బ్రిటన్‌)–హెలియోవారా (ఫిన్‌లాండ్‌)లను బోల్తా కొట్టించింది. 

85 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో యూకీ–గొరాన్సన్‌ ఒక ఏస్‌ సంధించి, నాలుగు డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది. తమ సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్‌ చేసింది. వాస్తవానికి ఈ టోర్నీలో తమ ర్యాంకింగ్‌ ప్రకారం యూకీ–గొరాన్సన్‌లకు క్వాలిఫయింగ్‌తోపాటు మెయిన్‌ ‘డ్రా’లోనూ చోటు దక్కలేదు. 

అయితే మెయిన్‌ ‘డ్రా’లో ఉన్న మార్కోస్‌ గిరోన్‌–లెర్నర్‌ టియెన్‌ (అమెరికా) చివరి నిమిషంలో వైదొలగడంతో ‘రిజర్వ్‌’ పూల్‌లో ఉన్న యూకీ–గొరాన్సన్‌లకు ఈ టోర్నీలో ఆడే అవకాశం లభించింది. క్వార్టర్‌ ఫైనల్‌ చేరడంతో యూకీ బాంబ్రీ –గొరాన్సన్‌లకు 65 వేల డాలర్ల (రూ. 56 లక్షల 67 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 180 ర్యాంకింగ్‌ పాయింట్లు ఖరారయ్యాయి.   

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)