Breaking News

కౌంటీలకు రుతురాజ్‌ గైక్వాడ్‌

Published on Wed, 06/11/2025 - 00:57

లీడ్స్‌: భారత బ్యాటర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ ఇంగ్లండ్‌లో కౌంటీ క్రికెట్‌ ఆడనున్నాడు. యార్క్‌షైర్‌ తరఫున అతను డివిజన్‌–1 కౌంటీ చాంపియన్‌షిప్‌తో పాటు వన్డే కప్‌లో ఆడతాడని తెలిసింది. వచ్చేనెల సర్రే జట్టుతో జరిగే మ్యాచ్‌ నుంచి సీజన్‌ ముగిసేదాకా జట్టుకు అందుబాటులో ఉంటాడని యార్క్‌షైర్‌ కౌంటీ జట్టు తెలిపింది. ఈ 28 ఏళ్ల టాపార్డర్‌ బ్యాటర్‌ ప్రస్తుతం ఇంగ్లండ్‌లోనే ఉన్నాడు. ఇంగ్లండ్‌ పర్యటనకు వచ్చిన భారత్‌ ‘ఎ’ జట్టులో సభ్యుడైన గైక్వాడ్‌కు రెండు అనధికారిక టెస్టుల్లోనూ ఆడే అవకాశమైతే రాలేదు. 

ఇంగ్లండ్‌ లయన్స్‌తో జరిగిన ఆ రెండు టెస్టులు ‘డ్రా’గానే ముగిశాయి. ఇక 13 నుంచి 16 వరకు బెకెన్‌హామ్‌లో భారత సీనియర్‌ జట్టుతో జరిగే నాలుగు రోజుల వార్మప్‌ మ్యాచ్‌లో భారత్‌ ‘ఎ’ ఆడనుంది. ఇందులోనైనా రుతురాజ్‌కు అవకాశం లభిస్తుందేమో చూడాలి. ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ కెపె్టన్, రంజీల్లో మహారాష్ట్ర జట్టు కెపె్టన్‌ కూడా అయిన రుతురాజ్‌ గైక్వాడ్‌ ఇప్పటి వరకు టీమిండియా తరఫున ఆరు వన్డేలు, 23 టి20లు ఆడాడు. 

కౌంటీల్లో కీలకమైన మ్యాచ్‌లు ఉన్న తరుణంలో రుతురాజ్‌లాంటి టాపార్డర్‌ బ్యాటర్‌ ఆడనుండటం తమకు లాభిస్తుందని యార్క్‌షైర్‌ హెడ్‌ కోచ్‌ ఆంథోని మెక్‌గ్రాత్‌ అన్నారు. అతని చేరిక తమ జట్టుకు అదనపు బలాన్ని చేకూరుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. యార్క్‌షైర్‌లాంటి ప్రముఖ ఇంగ్లండ్‌ కౌంటీ జట్టుకు ఆడటాన్ని గౌరవంగా భావిస్తున్నానని గైక్వాడ్‌ చెప్పాడు. దిగ్గజ భారత క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ కూడా టీనేజ్‌లో యార్క్‌షైర్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 1992లో 19ఏళ్ల ప్రాయంలో సచిన్‌ యార్క్‌షైర్‌ తరఫున బరిలోకి దిగాడు.  

Videos

ఎక్కడ దాక్కున్నావ్ లోకేష్.. కొండారెడ్డి బురుజుకు ఇప్పుడురా..

సరదాకు ఉద్యమాలు చేయడం లేదు.. ఇంకెంతకాలం సాగదీస్తావ్ చంద్రబాబు

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేయడం కూటమి పిరికి చర్య..

POLITICAL CORRIDOR: అవును వాళ్లిద్దరూ ఫ్రెండ్స్

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Russia Ukraine War : పుతిన్ ఆఫర్..యుద్ధం ముగిసేనా..?

స్టాక్ మార్కెట్ లో కోట్లు, మోహ్నిష్ పాబ్రాయ్ షాకింగ్ స్టాటజీ

లోకేష్ రాజీనామా చేయాలి

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు