Breaking News

భారత క్రికెటర్‌కు అరుదైన గౌరవం.. 

Published on Tue, 07/25/2023 - 13:26

భారత మహిళా క్రికెటర్ మిన్ను మణికి కేరళలోని మనంతవాడి మున్సిపాలిటీ అరుదైన గౌరవం ఇచ్చింది. వయనాడ్ జిల్లాలోని ఈ మున్సిపాలిటీలో ఉన్న మైసూరు రోడ్డు జంక్షన్ పేరును మిన్ను మణి జంక్షన్ గా మార్చేసింది. తనకు ఈ గౌరవం దక్కడం పట్ల మిన్ను చాలా సంతోషాన్ని వ్యక్తం చేసింది.

జులై 9న బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టి20తో మిన్ను మణి అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేసింది. తొలి మ్యాచ్ లోనే అదరగొట్టింది. బంగ్లా బ్యాటర్ షమీమా సుల్తానాను తొలి వికెట్‌గా దక్కించుకుంది.తర్వాతి రెండు మ్యాచ్ లలో వరుసగా 4 ఓవర్లలో కేవలం 9 రన్స్ ఇచ్చి 2 వికెట్లు, 4 ఓవర్లలో 28 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకుంది. సిరీస్ లో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్లలో రెండో స్థానంలో నిలిచింది. మూడు టీ20ల్లో కేవలం 11.6 సగటుతో 5 వికెట్లు తీసింది.

కాగా ఈ నెల 14న ప్రత్యేకంగా సమావేశమైన మనంతవాడి మున్సిపల్ కౌన్సిల్.. మైసూరు రోడ్డు జంక్షన్ ను మిన్ను మణి జంక్షన్ గా మార్చాలని నిర్ణయించారు. మిన్నును ఎలా గౌరవించాలా అని ఆలోచించే క్రమంలో ఇలా రోడ్డు జంక్షన్ కు ఆమె పేరు పెట్టాలని నిర్ణయించినట్లు మనంతవాడి మున్సిపల్ ఛైర్ పర్సన్ రత్నవల్లి చెప్పారు.

మనంతవాడిలో మిన్ను ఇంటికి మంచి రోడ్డు వేస్తామని స్థానిక ఎమ్మెల్యే ఓఆర్ కేలు చెప్పారు. మున్సిపల్ రోడ్డు నుంచి 200 మీటర్ల దూరంలో ఆమె ఇల్లు ఉంది. ప్రస్తుతం ఆమె ఇంటికి వెళ్లడానికి సరైన రోడ్డు సౌకర్యం లేదు. త్వరలోనే ఈ రోడ్డు నిర్మాణం పూర్తవుతుందని ఈ సందర్భంగా కేలు హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా మిన్నును సన్మానించేందుకు ప్రత్యేక కార్యక్రమం కూడా మనంతవాడి మున్సిపాలిటీ అధికారులు చేపట్టారు. 

చదవండి: కోహ్లి టాప్‌ అనుకుంటే పప్పులో కాలేసినట్లే..

వరుస విజయాలు.. కెరీర్‌ బెస్ట్‌ అందుకున్న సాత్విక్‌-చిరాగ్‌ జోడి

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)