Breaking News

టాపార్డర్‌ విఫలం

Published on Fri, 08/22/2025 - 00:44

బ్రిస్బేన్‌: టాపార్డర్‌ విఫలమవడంతో... ఆ్రస్టేలియా మహిళల ‘ఎ’ జట్టుతో గురువారం ప్రారంభమైన ఏకైక అనధికారిక టెస్టులో భారత మహిళల ‘ఎ’ జట్టు కష్టాల్లో పడింది. వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్‌లో టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన రాధా యాదవ్‌ సారథ్యంలోని భారత మహిళల ‘ఎ’ జట్టు తొలి రోజు ఆట నలిచే సమయానికి 23.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. ఓపెనర్‌ షఫాలీ వర్మ (38 బంతుల్లో 35; 8 ఫోర్లు) క్రీజులో ఉన్నంతసేపు ధాటిగా ఆడింది. 

మరో ఓపెనర్‌ నందిని కశ్యప్‌ (0), ధారా గుజ్జర్‌ (0) డకౌట్‌ కాగా... తేజల్‌ హసబి్నస్‌ (9; 2 ఫోర్లు), తనుశ్రీ సర్కార్‌ (13; 2 ఫోర్లు) విఫలమయ్యారు. కెప్టెన్ రాధా యాదవ్‌ (8 బ్యాటింగ్‌; 1 ఫోర్‌), రాఘ్వీ బిస్త్‌ (26 బ్యాటింగ్‌; 5 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా టి20 సిరీస్‌ను 0–3తో కోల్పోయిన భారత మహిళల ‘ఎ’ జట్టు, వన్డే సిరీస్‌ను 2–1తో కైవసం చేసుకుంది. 

ఏకైక అనధికారిక టెస్టుకు వర్షం ఆటంకం కలిగించగా... ఆట సాగిన కాసేపులోనే భారత జట్టు వెనుకబడిపోయింది. ఆసీస్‌ బౌలర్ల ధాటికి ఎదురునిలవలేక మన బ్యాటర్లు ఒకరి వెంట ఒకరు పెవిలియన్‌కు వరుస కట్టారు. ఆ్రస్టేలియా ‘ఎ’ జట్టు బౌలర్లలో జార్జియా 3 వికెట్లు పడగొట్టింది. 

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)