Breaking News

మహిళల టి20 ప్రపంచకప్‌ వార్మప్‌ మ్యాచ్‌లో భారత్‌ ఘన విజయం

Published on Mon, 09/30/2024 - 06:24

అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) మహిళల టి20 ప్రపంచకప్‌ తొలి వార్మప్‌ మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించింది. ఆదివారం జరిగిన పోరులో భారత అమ్మాయిల జట్టు 20 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ మహిళల జట్టుపై గెలిచింది. మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిరీ్ణత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్‌(40 బంతుల్లో 52; 5 ఫోర్లు) అర్ధ శతకంతో ఆకట్టుకోగా... యస్తిక భాటియా (24; ఒక ఫోర్, ఒక సిక్సర్‌) ఫర్వాలేదనిపించింది.

 వెస్టిండీస్‌ బౌలర్లలో  హేలీ మాథ్యూస్‌ నాలుగు వికెట్లు పడగొట్టింది. అనంతరం లక్ష్య ఛేదనలో వెస్టిండీస్‌ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది. చీనిల్‌ హెన్రీ (48 బంతుల్లో 59; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్‌ సెంచరీ సాధించింది. భారత బౌలర్లలో పూజ వస్త్రకర్‌ 3,  దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టారు. రెండో వార్మప్‌ మ్యాచ్‌లో మంగళవారం దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో భారత జట్టు తలపడనుంది. గురువారం నుంచి మహిళల  ప్రపంచకప్‌ ప్రధాన టోర్నీ ప్రారంభం కానుంది.   
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)