Breaking News

ENG W Vs IND W : ఇంగ్లండ్‎పై భారత్ ఘన విజయం

Published on Wed, 07/02/2025 - 07:50

బ్రిస్టల్‌: బ్యాటర్లు జెమీమా రోడ్రిగ్స్‌ (41 బంతుల్లో 63; 9 ఫోర్లు, 1 సిక్స్‌), అమన్‌జ్యోత్‌ కౌర్‌ (40 బంతుల్లో 63 నాటౌట్‌; 9 ఫోర్లు) అర్ధ సెంచరీలతో అదరగొట్టారు. ఫలితంగా ఇంగ్లండ్‌తో రెండో టి20లో భారత మహిళల క్రికెట్‌ జట్టు మెరుగైన ప్రదర్శన చేసింది. 

కాగా ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో భాగంగా మంగళవారం రెండో మ్యాచ్‌లో టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. 

రిచా ఘోష్‌ (20 బంతుల్లో 32 నాటౌట్‌; 6 ఫోర్లు) ధాటిగా ఆడింది. గత మ్యాచ్‌లో సెంచరీతో విజృభించిన స్మృతి మంధాన (13; 2 ఫోర్లు), షఫాలీ వర్మ (3), కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (1) విఫలమయ్యారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో లౌరెన్‌బెల్‌ 2 వికెట్లు పడగొట్టింది.  

అనంతరం లక్ష్య చేధనకు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి కేవలం 157 పరుగులు మాత్రమే చేసింది. ఫలితంగా భారత్ 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లండ్‌ బ్యాటర్లలో టామీ బీమౌంట్‌ అర్ధ శతకం (54)తో రాణించగా.. మిగిలిన వారిలో ఎమీ జోన్స్‌ (32), సోఫీ ఎక్లిస్టోన్‌ (35) మాత్రమే ఫర్వాలేదనిపించారు. 

ఇక భారత బౌలర్లలో శ్రీ చరణి రెండు వికెట్లు దక్కించుకోగా.. దీప్తి శర్మ, అమన్‌జోత్‌ కౌర్‌ చెరో వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో రాణించిన అమన్‌జోత్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)