Breaking News

ముక్కోణ‌పు వ‌న్డే సిరీస్ విజేత‌గా భార‌త్.. ఫైన‌ల్లో శ్రీలంక చిత్తు

Published on Sun, 05/11/2025 - 18:10

మ‌హిళ‌ల ముక్కోణ‌పు వ‌న్డే సిరీస్ విజేత‌గా భార‌త్ నిలిచింది. ఆదివారం కొలంబో వేదిక‌గా ఆతిథ్య శ్రీలంక‌తో జ‌రిగిన  ఫైన‌ల్‌లో 97 ప‌రుగుల తేడాతో భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు ఘ‌న విజ‌యం సాధించింది. ఈ తుది పోరులో మొద‌ట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 342 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది.

భార‌త బ్యాట‌ర్ల‌లో స్టార్ ఓపెన‌ర్ స్మృతి మంధాన (Smriti Mandhana) అద్బుత‌మైన సెంచ‌రీతో చెల‌రేగింది. మంధాన క్రీజులో ఉన్నంతసేపు బౌండ‌రీల వర్షం కురిపించింది. మొత్తంగా 101 బంతులు ఎదుర్కొని 15 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 116 పరుగులు సాధించింది. ఆమెతో పాటు హ‌ర్లీన్ డియోల్‌(47), రోడ్రిగ్స్‌(44), హర్మ‌న్ ప్రీత్ కౌర్‌(41) కీల‌క ఇన్నింగ్స్‌లు ఆడారు. లంక బౌల‌ర్ల‌లో మల్కీ మదార, విహంగా, కుమారి త‌లా వికెట్ సాధించారు.

అమ‌న్ అదుర్స్‌.. నాలుగేసిన రాణా
అనంత‌రం 343 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన శ్రీలంక అమ్మాయిల జ‌ట్టు భార‌త బౌల‌ర్ల దాటికి 48.2 ఓవ‌ర్ల‌లో 245 ప‌రుగులకు కుప్ప‌కూలింది. శ్రీలంక బ్యాట‌ర్ల‌లో కెప్టెన్ చ‌మీరా ఆత‌ప‌ట్టు(51), నీలాక్షి డి సిల్వా(48), విష్మి గుణరత్నే(36) రాణించారు. మిగితా బ్యాట‌ర్లంతా నామమాత్ర‌పు స్కోర్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు.

భార‌త బౌల‌ర్ల‌లో స్నేహ్ రాణా నాలుగు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. అమన్‌జోత్ కౌర్ మూడు వికెట్లు సాధించారు. కాగా భారత్, శ్రీలంకతో పాటు దక్షిణాఫ్రికా పాల్గొన్న ఈ టోర్నమెంట్‌లో ఆడిన 4 మ్యాచ్‌ల్లో మూడింట గెలిచిన హ‌ర్మ‌న్ సేన‌... 6 పాయింట్లతో పట్టిక అగ్ర స్థానంలో నిలిచింది.

Videos

రవి కార్తీక్ కు జగన్ అభినందనలు..

జనసేన నేతలను చితక్కొట్టిన టీడీపీ అంబటి సెటైర్లు అదుర్స్

చుట్టమల్లే... ఆగలేదా? జూ.ఎన్టీఆర్ పై మళ్లీ...

పడిపోతున్న బంగారం ధరలు.. తులం ఎంతంటే?

నామినేషన్ వేయకుండా ఆపుతున్న పోలీసులు

చంద్రబాబు గుర్తుపెట్టుకో.. చీర లాగి.. ఇంత దారుణంగా కొడతారా..? జనసేన నేత వార్నింగ్

ప్రసాద్ బాబుకు ఒక న్యాయం.. ఇందిరకు మరో న్యాయమా?

విడుదల రజిని ఘటనపై ధ్రువ్ రాఠీ స్పందన

అల్లూరి జిల్లాలో ఘోర ప్రమాదం.. మైనింగ్ లో భారీ పేలుడు.. ఐదుగురు మృతి

రాత్రి వేళ గోడలు ఎక్కుతూ వేటాడుతున్న వింత రాకాసి!

Photos

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు