Breaking News

రచన, అశ్విని బంగారం

Published on Fri, 08/01/2025 - 01:19

ఏథెన్స్‌ (గ్రీస్‌): అంతర్జాతీయ స్థాయిలో మరోసారి భారత ‘పట్టు’ చాటుకుంటూ... ప్రపంచ అండర్‌–17 రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో మహిళా రెజ్లర్లు ఐదు పతకాలతో అదరగొట్టారు. ఇందులో రెండు స్వర్ణాలు, రెండు రజతాలు, ఒక కాంస్యం ఉన్నాయి. 43 కేజీల విభాగంలో రచన... 65 కేజీల విభాగంలో అశ్విని విష్ణోయ్‌ బంగారు పతకాలు సొంతం చేసుకోగా... 57 కేజీల విభాగంలో మోనీ, 73 కేజీల విభాగంలో కాజల్‌ రజత పతకాలు గెలిచారు. 49 కేజీల విభాగంలో కోమల్‌ వర్మ కాంస్య పతకాన్ని హస్తగతం చేసుకుంది. 

గురువారం జరిగిన ఫైనల్స్‌లో రచన 3–0తో జిన్‌ హువాంగ్‌ (చైనా)పై, అశ్విని 3–0తో ముఖాయో రఖిమ్‌జొనోవా (ఉజ్బెకిస్తాన్‌)పై విజయం సాధించారు. మద్‌ఖియా ఉస్మనోవా (కజకిస్తాన్‌)తో జరిగిన తుది పోరులో మోనీ 5–6 పాయింట్ల తేడాతో... వెన్‌జిన్‌ కియు (చైనా)తో జరిగిన ఫైనల్లో కాజల్‌ 5–8 పాయింట్ల తేడాతో ఓడిపోయారు. కాంస్య పతక బౌట్‌లో కోమల్‌ వర్మ 8–3 పాయింట్ల తేడాతో అన్‌హెలీనా బుర్కినా (రష్యా)పై గెలిచింది. మరోవైపు భారత్‌కే చెందిన యశిత (61 కేజీలు) స్వర్ణ పతకం కోసం... మనీషా (69 కేజీలు) కాంస్య పతకం కోసం ఈ రోజు పోటీపడనున్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)