Breaking News

అంకితకు రజతం

Published on Mon, 07/28/2025 - 04:27

రినె–రుర్‌ ఎసెన్‌ (జర్మనీ): ప్రపంచ యూనివర్సిటీ క్రీడల్లో భారత స్టీపుల్‌ఛేజర్‌ అంకిత ధ్యాని రజత పతకంతో మెరిసింది. మహిళల 3000 మీటర్ల పోటీలో అంకిత 9 నిమిషాల 31.99 సెకన్లలో లక్ష్యాన్ని చేరి రెండో స్థానంలో నిలవగా... పురుషుల 4x100 మీటర్ల రిలేలో భారత జట్టుకు కాంస్య పతకం దక్కింది. ఆదివారంతో ఈ టోర్నీ ముగియగా... చివరి రోజు భారత్‌ ఖాతాలో రెండు పతకాలు చేరాయి. ఓవరాల్‌గా ఈ క్రీడల్లో భారత్‌ 12 పతకాలు (2 స్వర్ణాలు, 5 రజతాలు, 5 కాంస్యాలు) సాధించింది. 

మహిళల స్టీపుల్‌చేజ్‌లో 23 ఏళ్ల అంకిత తన వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనతో వెండి వెలుగులు విరజిమ్మింది.  అంతకుముందు హీట్స్‌లో అగ్రస్థానంతో ఫైనల్‌కు చేరిన అంకిత... తుది రేసులోనూ జోరు కనబర్చి మిల్లీ సెకన్ల తేడాతో స్వర్ణానికి దూరమైంది. ఈ క్రమంలో తన గత వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన కంటే 7 సెకన్ల టైమింగ్‌ను మెరుగు పరుచుకోవడం విశేషం. పురుషుల 4x100 మీటర్ల రిలే టీమ్‌ రేసులో లాలు ప్రసాద్‌ భోయ్, అనిమేశ్, మణికంఠ, మృత్యం జయరాంతో కూడిన భారత జట్టు 38.89 సెకన్లలో లక్ష్యాన్ని చేరి కాంస్య పతకం గెలుచుకుంది. 

దక్షిణ కొరియా (38.50 సెకన్లు), దక్షిణాఫ్రికా (38.80 సెకన్లు) జట్లు వరుసగా స్వర్ణ, రజతాలు నెగ్గాయి. మహిళల 4్ఠ100 మీటర్ల రిలే టీమ్‌ విభాగంలో అనఖ బిజుకుమార్‌; దివ్యనిబ జాలా, రష్‌దీప్‌ కౌర్, రూపాల్‌తో కూడిన భారత జట్టు 2 నిమిషాల 35.8 సెకన్లలో లక్ష్యాన్ని చేరి ఐదో స్థానంలో నిలిచింది. పురుషుల 4x100 మీటర్ల రిలేలో విశాల్, అశ్విన్, జెరోమ్, బాలకృష్ణతో కూడిన భారత జట్టు 3 నిమిషాల 6.5 సెకన్లతో ఐదో స్థానానికి పరిమితమైంది. 

రేస్‌ వాక్‌లో భారత పురుషుల, మహిళల అథ్లెట్లు టాప్‌–10లో చోటు దక్కించుకోలేకపోయారు. అంతకుముందు మహిళల 20 కిలోమీటర్ల రేస్‌వాక్‌ టీమ్‌ విభాగంలో సెజల్‌ సింగ్, మునిత ప్రజాపతి, మాన్సి నేగితో కూడిన భారత జట్టు కాంస్య పతకం నెగ్గింది. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)