Breaking News

'బాక్సింగ్ డే టెస్టులో టీమిండియాదే గెలుపు... కానీ ఆ ఒక్కటే డౌట్‌'

Published on Wed, 12/25/2024 - 12:31

భార‌త్‌-ఆస్ట్రేలియా మ‌ధ్య ‘బాక్సింగ్‌ డే’ టెస్టు మ‌రి కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. మెల్‌బోర్న్ వేదిక‌గా జర‌గ‌నున్న ఈ మ్యాచ్ కోసం టీమిండియా(Teamindia) అన్ని విధాల స‌న్న‌ద్ద‌మైంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో పైచేయి సాధించాలని రోహిత్ సేన భావిస్తోంది. 2020–21 పర్యటనలో మెల్‌బోర్న్‌లో విజయంతోనే టీమిండియా సిరీస్‌ గెలుపు దిశగా అడుగు వేసింది.

ఈసారి కూడా అదే ఫలితాన్ని పున‌రావృతం చేయాలని భారత్ జట్టు యోచిస్తోంది. ప్రస్తుతం ఐదు మ్యాచ్‌ల బీజీటీ ట్రోఫీ 1-1తో సమంగా ఉంది. దీంతో ఈ బ్యాక్సింగ్ డే ఇరు జట్లకు చాలా కీలకం. ఈ నేపథ్యంలో టీమిండియాను ఉద్దేశించి పాక్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ ఆస‌క్తిక‌ర వాఖ్య‌లు చేశాడు. నాలుగో టెస్టులో భార‌త్ విజయం సాధిస్తుంద‌ని అలీ అంచ‌నా వేశాడు.

"మెల్‌బోర్న్ టెస్టులో భారత్ గెలుస్తుందని భావిస్తున్నాను. ఆఖరి రెండు టెస్టుల్లోనూ భారత్ ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశముంది. నాలుగో టెస్టులో ఓడిపోతే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరే ఛాన్స్‌లు సన్నగిల్లుతాయని ఆస్ట్రేలియా ఆందోళన చెందుతోంది.

ఆ తర్వాత శ్రీలంకతో జరగనున్న రెండు ‍మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆసీస్ గెలవడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఈ సిరీస్ శ్రీలంకలో జరగనుంది. ఉపఖండ పిచ్‌లలో స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయిస్తారు. ఇవన్నీ ఆసీస్ దృష్టిలో ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఈ ఒత్తిడిలో ఆస్ట్రేలియా తప్పులు చేసే అవకాశముంది. దీన్ని భారత్ సొమ్ము చేసుకోవాలి.

అయితే బ్రిస్బేన్‌, అడిలైడ్‌లో బ్యాటర్లు చేసిన తప్పిదాలు మెల్‌బోర్న్‌లో కూడా రిపీట్ చేస్తే భారత్‌కు కష్టాలు తప్పవు" అని తన యూట్యూబ్ ఛానల్‌లో అలీ పేర్కొన్నాడు. కాగా ఈ బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. రవీంద్ర జడేజాతో పాటు వాషింగ్టన్ సుందర్ కూడా ఆడనున్నట్లు సమాచారం.
చదవండి: IND vs AUS: ఆసీస్‌తో నాలుగో టెస్టు.. గిల్‌, నితీశ్ రెడ్డిపై వేటు! వారికి ఛాన్స్‌?

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)