Breaking News

ఇంగ్లండ్‌లో భారత్‌–పాక్‌ మ్యాచ్‌లు

Published on Tue, 09/16/2025 - 16:44

లుసానే: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) హాకీ ప్రొ లీగ్‌ కొత్త సీజన్‌ ఈ డిసెంబర్‌లోనే మొదలవుతుంది. 2025–26కు సంబంధించిన ప్రొ లీగ్‌ డిసెంబర్‌ 9 నుంచి అర్జెంటీనా, ఐర్లాండ్‌లలో జరుగుతుందని హాకీ వర్గాలు తెలిపాయి. ఈ సీజన్‌లో ఐర్లాండ్‌ మహిళల జట్టు, పాకిస్తాన్‌ పురుషుల జట్టు కొత్తగా చేరుతున్నాయి. 

ఈ రెండు జట్లు నేషన్స్‌ కప్‌ హాకీ టోర్నమెంట్‌ నుంచి అర్హత సాధించినట్లు ఎఫ్‌ఐహెచ్‌ తెలిపింది. వచ్చే సీజన్‌ మొత్తం 10 దేశాల్లో జరుగనుంది. రికార్డుస్థాయిలో 144 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. భారత్‌లో ఫిబ్రవరి 10 నుంచి 15 వరకు జరుగుతాయి. 

భారత్, పాకిస్తాన్‌ జట్ల మధ్య జూన్‌ 23 నుంచి 28 మధ్య ఇంగ్లండ్‌ వేదికగా రెండు మ్యాచ్‌లు జరుగుతాయి.  ఈ లీగ్‌లో విజేతగా నిలిచిన జట్లు 2028 ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తాయి. డిసెంబర్‌ 9న జరిగే పురుషుల ఈవెంట్‌ తొలి మ్యాచ్‌లో జర్మనీతో బెల్జియం తలపడుతుంది. 

దీంతో పాటు ఇంగ్లండ్‌ ఆడే మ్యాచ్‌లు కూడా ఐర్లాండ్‌లోనే జరుగుతాయి. అదే రోజు అర్జెంటీనాలో జరిగే మ్యాచ్‌లో ప్రస్తుత చాంపియన్‌ నెదర్లాండ్స్‌తో పాకిస్తాన్‌ ఢీకొంటుంది. అనంతరం చైనా, స్పెయిన్, ఆ్రస్టేలియా, భారత్, ఇంగ్లండ్, నెదర్లాండ్స్, బెల్జియం, జర్మనీలలో  జూన్‌ 28 వరకు లీగ్‌ దశ మ్యాచ్‌లే జరుగుతాయి.    

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)