Breaking News

భారత్‌-పాకిస్తాన్‌ ఫైనల్‌ పోరు.. ఏ జట్టు ఫేవరేట్‌ అంటే?

Published on Sun, 07/23/2023 - 11:38

ఆసియా ‘ఎమర్జింగ్‌’ కప్‌ టోర్నీ తుది పోరుకు రంగం సిద్ధమైంది. కొలంబోలో నేడు జరిగే ఫైనల్లో పాకిస్తాన్‌ ‘ఎ’తో భారత్‌ ‘ఎ’ తలపడుతుంది. బలాబలాలను బట్టి చూస్తే యశ్‌ ధుల్‌ నాయకత్వంలోని భారత జట్టే ఫేవరెట్‌గా ఉంది. లీగ్‌ దశలో ఇరు జట్ల మధ్య జరిగిన పోరులో భారత్‌ 8 వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసింది. టోర్నీలో చెరో సెంచరీ, హాఫ్‌ సెంచరీ చేసిన ధుల్, సాయి సుదర్శన్‌ మంచి ఫామ్‌లో ఉన్నారు.

బౌలింగ్‌లో కూడా నిశాంత్‌ సింధు 10 వికెట్లతో టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. పాకిస్తాన్‌ టీమ్‌ను చూస్తే పలువురు ఆటగాళ్లు మొహమ్మద్‌ వసీమ్, కెప్టెన్‌ మొహమ్మద్‌ హారిస్, ఫర్హాన్, అర్షద్‌ ఇక్బాల్‌లకు ఇప్పటికే సీనియర్‌ టీమ్‌ తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది.  ఈ నేపథ్యంలో వీరు చెలరేగితే టీమిండియా తీవ్ర పోటీ ఎదురువ్వక తప్పదు.

తుది జట్లు(అంచనా):
భారత్‌: సాయి సుదర్శన్, అభిషేక్ శర్మ, యశ్ ధుల్ (కెప్టెన్‌), ధ్రువ్ జురెల్ (వికెట్‌ కీపర్‌), రియాన్ పరాగ్, నికిన్ జోస్, నిశాంత్ సింధు, హర్షిత్ రాణా, మానవ్ సుతార్, రాజవర్ధన్ హంగర్గేకర్, యువరాజ్‌

పాకిస్తాన్‌: సయీమ్ అయూబ్, తయ్యబ్ తాహిర్, మహ్మద్ హారీస్ (కెప్టెన్‌), సాహిబ్జాదా ఫర్హాన్, ఒమైర్ యూసుఫ్, ఖాసిం అక్రమ్, ముబాసిర్ ఖాన్, అమద్ బట్, మహ్మద్ వసీం జూనియర్, అర్షద్ ఇక్బాల్, సుఫియాన్ ముఖీమ్
చదవండి:
 IND vs WI: అశ్విన్‌తో అట్లుంటది మరి.. విండీస్‌ కెప్టెన్‌ ఫ్యూజ్‌లు ఔట్‌! వీడియో వైరల్‌

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)