ఇషాన్‌ కిషన్‌ ఊచకోత.. 4 ఫోర్లు, 10 సిక్స్‌లతో వీర విహారం

Published on Sat, 01/31/2026 - 20:30

తిరువ‌నంత‌పురం వేదిక‌గా న్యూజిలాండ్ జ‌రుగుతున్న ఐదో టీ20లో టీమిండియా వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ ఇషాన్ కిష‌న్ విధ్వంసం సృష్టించాడు. గ్రీన్ ఫీల్డ్ మైదానం‍లో కిషన్ సిక్సర్ల వర్షం కురిపించాడు. బౌలర్ ఎవరైనా తనకు తెలిసింది హిట్టింగ్ ఒక్కటే అన్నట్లగా కిషన్ ఇన్నింగ్స్ కొనసాగింది.

ఈ క్రమంలో కిషన్ కేవలం 42 బంతుల్లోనే తొలి టీ20 అంతర్జాతీయ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. మొత్తంగా 43 బంతులు ఎదుర్కొన్న ఇషాన్‌.. 4 ఫోర్లు, 10 సిక్స్‌లతో 103 పరుగులు చేశాడు. అతడి మెరుపు బ్యాటింగ్‌కు ప్రత్యర్ధి ప్లేయర్లు సైతం ఫిదా అయిపోయారు.

అత‌డితో పాటు కెప్టెన్ సూర్య కుమార్ యాద‌వ్‌(30 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 63) మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. అదేవిధంగా హార్దిక్ పాండ్యా(17 బంతుల్లో 1 ఫోర్లు, 4 సిక్స్‌లతో 42), అభిషేక్‌ శర్మ(16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 30) దూకుడుగా ఆడారు. ఫలితంగా టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భార‌త్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి ఏకంగా 271 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది.

#

Tags : 1

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)