Breaking News

విజయంపై గురి

Published on Tue, 06/24/2025 - 04:36

భారత బ్యాటింగ్‌ దళం అంచనాలకు అనుగుణంగా తమ బాధ్యత ముగించింది. చివర్లో కొంత తడబాటు కనిపించినా...రాహుల్, పంత్‌ సెంచరీలతో చెలరేగి భారీ భాగస్వామ్యం నెలకొల్పడంతో ప్రత్యరి్థకి కష్టసాధ్యమైన లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇప్పుడు ఇక బౌలర్ల వంతు...బుమ్రా ఒక్కడే ఇంగ్లండ్‌ ఆట కట్టిస్తాడా...ఈసారి మేం కూడా అంటూ ఇతర బౌలర్లూ సహకరిస్తారా అనేది చూడాలి.

చివరి రోజు 90 ఓవర్లలో 350 పరుగులు చేయాల్సిన ఇంగ్లండ్‌ దూకుడుగా ఆడి ఛేదనకు మొగ్గు చూపుతుందా...లేక పరిస్థితి మారిపోతే కాస్త తగ్గి ‘డ్రా’కు ప్రయతి్నస్తుందా చూడాలి. మరోవైపు హెడింగ్లీ మైదానంలో ఆఖరి రోజు ఆటకు వాన ముప్పు కూడా ఉంది!  

లీడ్స్‌: భారత్, ఇంగ్లండ్‌ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రసవత్తర స్థితికి చేరింది. 371 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 6 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. జాక్‌ క్రాలీ (12 బ్యాటింగ్‌), బెన్‌ డకెట్‌ (9 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు భారత్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో 96 ఓవర్లలో 364 పరుగులకు ఆలౌటైంది. కేఎల్‌ రాహుల్‌ (247 బంతుల్లో 137; 18 ఫోర్లు) శతకం పూర్తి చేసుకోగా... రిషభ్‌ పంత్‌ (140 బంతుల్లో 118; 15 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఈ టెస్టులో రెండో సెంచరీ సాధించాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 195 పరుగులు జోడించారు. ఒకదశలో 333/4తో ఉన్న భారత్‌ 31 పరుగుల వ్యవధిలో చివరి 6 వికెట్లు కోల్పోయింది.  

తొలి సెషన్‌ నెమ్మదిగా... 
ఓవర్‌నైట్‌ స్కోరు 90/2తో నాలుగో రోజు ఆట కొనసాగించిన భారత్‌ అదే స్కోరు వద్ద కెపె్టన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (8) వికెట్‌ కోల్పోయింది. దాంతో రాహుల్, పంత్‌ తొలి సెషన్‌లో చాలా జాగ్రత్తగా ఆడారు. 87 బంతుల్లో రాహుల్‌ హాఫ్‌ సెంచరీని అందుకున్నాడు. ఇంగ్లండ్‌ కూడా చక్కటి నియంత్రణతో బౌలింగ్‌ చేయడంతో పరుగులు అంత సులువుగా రాలేదు. 58 పరుగుల వద్ద రాహుల్‌ ఇచి్చన క్యాచ్‌ను బ్రూక్‌ వదిలేయడం జట్టుకు కలిసొచ్చింది. తొలి సెషన్‌లో భారత్‌ 24.1 ఓవర్లలో 63 పరుగులే చేయగలిగింది.  

పంత్, రాహుల్‌ జోరు... 
లంచ్‌ తర్వాత ఒక్కసారిగా భారత్‌ ఆట మారింది. బ్యాట్‌ ఝళిపించిన పంత్‌ దూకుడు పెంచి పరుగులు రాబట్టగా... రాహుల్‌ తనదైన శైలిలో చూడచక్కటి షాట్లతో అలరించారు. 83 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న పంత్‌ ఆ తర్వాత మరింత ధాటిగా ఆడుతూ తర్వాతి 25 బంతుల్లోనే 44 పరుగులు రాబట్టాడు. మరోవైపు 202 బంతుల్లో రాహుల్‌ సెంచరీ పూర్తయింది. ఆ తర్వాత కొద్ది సేపటికే పంత్‌ కూడా ఈ టెస్టులో రెండో సెంచరీని (130 బంతుల్లో) తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ జోడీని విడదీసేందుకు తీవ్రంగా శ్రమించిన ఇంగ్లండ్‌ ఎట్టకేలకు 46.4 ఓవర్ల తర్వాత సఫలమైంది. 

శతకం పూర్తయిన తర్వాత రూట్‌ ఓవర్లో వరుసగా 4, 6, 4 బాదిన పంత్‌... బషీర్‌ వేసిన తర్వాతి ఓవర్లో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి వెనుదిరిగాడు. రెండో సెషన్‌లో భారత్‌ 27 ఓవర్లలోనే ఏకంగా 5.37 రన్‌రేట్‌తో 145 పరుగులు సాధించడం విశేషం. విరామానంతరం ఆట మళ్లీ మలుపు తిరిగింది. కార్స్‌ బౌలింగ్‌లో రాహుల్‌ బౌల్డ్‌ కాగా...కరుణ్‌ నాయర్‌ (20) మరో అవకాశాన్ని వృథా చేసుకున్నాడు. ఆ తర్వాత టంగ్‌ నాలుగు బంతుల్లో శార్దుల్‌ (4), సిరాజ్‌ (0), బుమ్రా (0)లను అవుట్‌ చేయగా... ప్రసిధ్‌ కృష్ణ (0) చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. మరో ఎండ్‌లో రవీంద్ర జడేజా (40 బంతుల్లో 25 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌) కొన్ని పరుగులు జోడించగలిగాడు.  

స్కోరు వివరాలు 
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 471; 
ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 465; 
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి) స్మిత్‌ (బి) కార్స్‌ 4; రాహుల్‌ (బి) కార్స్‌ 137; సాయి సుదర్శన్‌ (సి) క్రాలీ (బి) స్టోక్స్‌ 30; గిల్‌ (బి) కార్స్‌ 8; పంత్‌ (సి) క్రాలీ (బి) బషీర్‌ 118; నాయర్‌ (సి అండ్‌ బి) వోక్స్‌ 20; జడేజా (నాటౌట్‌) 25; శార్దుల్‌ (సి) రూట్‌ (బి) టంగ్‌ 4; సిరాజ్‌ (సి) స్మిత్‌ (బి) టంగ్‌ 0; బుమ్రా (బి) టంగ్‌ 0; ప్రసిధ్‌ (సి) టంగ్‌ (బి) బషీర్‌ 0; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (96 ఓవర్లలో ఆలౌట్‌) 364. వికెట్ల పతనం: 1–16, 2–82, 3–92, 4–287, 5–333, 6–335, 7–349, 8–349; 9–349; 10–364. బౌలింగ్‌: వోక్స్‌ 19–4–45–1, కార్స్‌ 19–2–80–3, టంగ్‌ 18–2–72–3, బషీర్‌ 22–1–90–2, స్టోక్స్‌ 15–2–47–1, రూట్‌ 3–0–21–0.  

ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌: క్రాలీ (బ్యాటింగ్‌) 12; డకెట్‌ (బ్యాటింగ్‌) 9; ఎక్స్‌ట్రాలు 0; మొత్తం (6 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా) 21. బౌలింగ్‌: బుమ్రా 3–0–9–0, సిరాజ్‌ 2–1–9–0, జడేజా 1–0–3–0.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)