Breaking News

ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌.. భారత్‌-ఇంగ్లండ్‌ ఐదో టెస్టుపై నీలినీడలు

Published on Mon, 03/04/2024 - 10:46

ధర్మశాల వేదికగా భారత్‌-ఇంగ్లండ్‌ జట్లు తలపడేందుకు సిద్దమవుతున్నాయి. మార్చి 7 నుంచి ఇరు జట్ల మధ్య ఈ ఆఖరి టెస్టు ప్రారంభం కానుంది. ఇప్పటికే సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత జట్టు ఆఖరి మ్యాచ్‌లో కూడా ప్రత్యర్ధిని చిత్తు చేయాలని భావిస్తుంటే.. ఇంగ్లండ్‌ మాత్రం భారత టూర్‌ విజయంతో ముగించాలని వ్యూహాలు రచిస్తోంది. ఇంగ్లండ్‌ జట్టు ఇప్పటికే ధర్మశాలకు చేరుకోగా.. టీమిండియా సోమవారం చేరుకునే ఛాన్స్‌ ఉంది.

నీలినీడలు..
అయితే ఈ మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఆఖరి టెస్టు సజావుగా జరిగే సూచనలు కన్పించడం లేదు. ధర్మశాల వాతావరణమే ఇందుకు కారణం. ఐదో టెస్టు మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశమున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. ఆదివారం(మార్చి 3) అయితే ఎడతెరిపి లేకుండా వర్షం కురిసినట్లు తెలుస్తోంది.

రానున్న ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉన్నట్లు అక్కడి వాతావరణ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.అంతేకాకుండా అక్కడ చాలా చల్లని వాతావరణం ఆటగాళ్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ది టెలిగ్రాఫ్ నివేదిక ప్రకారం.. "ధర్మశాలలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది.

అంతేకాకుండా వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గరిష్ట ఉష్ణోగ్రత 1 డిగ్రీ సెల్సియస్‌గానూ, కనిష్ట ఉష్ణోగ్రత -4 డిగ్రీల కంటే తక్కువగానూ ఉండే ఛాన్స్‌ ఉంది. వర్షంతో పాటు హిమపాతం కూడా మ్యాచ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందని" నివేదిక పేర్కొంది.
 

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)