Breaking News

డబ్ల్యూటీసీ ఫైనల్‌పై పాంటింగ్‌ జోస్యం.. విజేత ఎవరంటే?

Published on Sat, 05/20/2023 - 12:50

క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌కు సమయం దగ్గరపడుతోంది. లండన్‌ వేదికగా జూన్‌ 7న ప్రారంభం కానున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆస్ట్రేలియా, భారత జట్లు తలపడనున్నాయి. కాగా ఈ మెగా ఫైనల్లో ఎవరు గెలుస్తారనే ఆంశంపై మాజీ క్రికెటర్‌లు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

తాజాగా ఈ జాబితాలోకి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ చేరాడు. భారత్‌ కంటే ఆసీస్‌కే విజయం సాధించే ఛాన్స్‌లు ఎక్కువగా ఉన్నాయని పాంటింగ్‌ జోస్యం చెప్పాడు. లండన్‌లోని ఓవల్‌ మైదానం పరిస్థితులు ఆస్ట్రేలియా తరహాలోనే ఉంటాయని పాంటింగ్‌ తెలిపాడు.

"ఓవల్‌ పిచ్‌ ఆస్ట్రేలియా వికెట్‌ మాదిరిగానే ఉంటుంది. కాబట్టి ఆసీస్‌కు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదే మ్యాచ్‌ భారత్‌లో జరిగితే కచ్చితంగా టీమిండియానే విజయం సాధించేది. ఆస్ట్రేలియా గెలవడం చాలా కష్టంన. అదే ఆస్ట్రేలియాలో జరిగితే ఆసీస్‌ ఫేవరెట్ అని చెబుతాను. ఈ ఫైనల్‌ ఇంగ్లండ్‌లో జరుగుతుంది కాబట్టి రెండు జట్లు కూడా తీవ్రంగా పోటీపడతాయి.

1990వ దశకం చివరలో లేదా 2000వ దశకం ప్రారంభంతో పోలిస్తే ఇప్పుడు విదేశీ గడ్డపై భారత్‌ అద్భుతుంగా ఆడుతోంది. వారి బ్యాటింగ్‌ స్కిల్స్‌ కూడా మెరుగయ్యాయి. గత 10-15 ఏళ్లలో భారత క్రికెట్‌ మంచి ఫాస్ట్‌బౌలర్లను తయారు చేసింది. వారు జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు" ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాంటింగ్‌ పేర్కొన్నాడు.
చదవండి: అతడే మ్యాచ్‌ను ఫినిష్‌ చేస్తాడని అనుకున్నా.. మేం షాక్‌లో ఉన్నాం: శాంసన్‌

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)