Breaking News

ఆస్ట్రేలియాతో ఫైనల్‌ పోరు.. టీమిండియా ప్రతీకారం తీర్చుకుంటుందా?

Published on Fri, 02/09/2024 - 08:52

భారత్‌, ఆస్ట్రేలియా మధ్య మరో కీలకపోరుకు రంగం సిద్దమైంది. అయితే ఈసారి పోరు సీనియర్ల మధ్య కాదు జూనియర్ల మధ్య. అండర్‌ 19 వరల్డ్‌కప్‌-2024 ఫైనల్లో టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు అమీతుమీ తెల్చుకోన్నాయి. శుక్రవారం జరిగిన రెండో సెమీఫైనల్లో పాకిస్తాన్‌పై ఒక్క వికెట్‌ తేడాతో విజయం సాధించిన ఆసీస్‌.. తమ ఫైనల్‌ బెర్త్‌ను ఖారారు చేసుకుంది.

 అంతకముందు తొలి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించిన యువ భారత్‌.. 9వ సారి ఫైనల్లో అడుగుపెట్టింది. అండర్‌-19 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరడం ఇది ఆరోసారి. ఫిబ్రవరి 11న సౌతాఫ్రికా బినోని స్టేడియం వేదికగా ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది.

జూనియర్లు ప్రతీకారం తీర్చుకుంటారా?
కాగా గత ఏడాదికాలంలో ఐసీసీ ఈవెంట్‌ ఫైనల్లో భారత్- ఆస్ట్రేలియా తలపడడం ఇది ముచ్చటగా మూడో సారి. గత రెండు ఈవెంట్​ (డబ్ల్యూటీసీ 2023, వన్డే వరల్డ్‌కప్‌ 2023)ల్లోనూ ఆసీస్ గెలుపొంది.. భారత అభిమానుల ఆశలపై నీళ్లు జల్లింది. ఈ క్రమంలో కనీసం యువ భారత జట్టు అయినా ఫైనల్లో ఆసీస్‌ను ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని 140 కోట్ల మంది అభిమానులు భావిస్తున్నారు. మరి భారత్‌ ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా మరోసారి దాసోహం అంటుందా అన్నది ఆదివారం వరకు వేచి చూడాలి.

కంగారులపై మనదే పై చేయి..
ఇక అండర్‌-19 వరల్డ్‌కప్‌లో మాత్రం కంగారులపై టీమిండియాదే పై చేయి. ఈ మెగా ఈవెంట్‌ ఫైనల్‌ పోరులో భారత్‌-ఆస్ట్రేలియా తలపడడం ఇది మూడో సారి. 2003 అండర్‌-19 వరల్డ్‌కప్‌ ఫైనల్లో తొలిసారిగా ఆసీస్‌- టీమిండియా తలపడ్డాయి. ఈ టోర్నీలో ఆసీస్‌ జట్టు కెప్టెన్‌గా రికీ పాంటింగ్‌ వ్యవహరించగా.. భారత జట్టును సౌరవ్‌ గంగూలీ ముందుకు నడిపించాడు.

అయితే ఫైనల్‌ మ్యాచ్‌లో 125 పరుగుల తేడాతో భారత్‌ను ఆసీస్‌ చిత్తు చేసింది. కానీ ఆ తర్వాత టోర్నీల్లో మాత్రం భారత్‌ జూలు విధిల్చింది. అనంతరం మళ్లీ 9 ఏళ్ల తర్వాత 2012 వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఆసీస్‌- భారత్‌ అమీతుమీ తెల్చుకున్నాయి. ఈ ఫైనల్‌ మ్యాచ్‌లో ఉన్ముక్త్‌ చంద్‌ నేతృత్వంలోని భారత జట్టును ఆసీస్‌ను ఓడించి టైటిల్‌ను ముద్దాడింది. అదే విధంగా 2018 వరల్డ్‌కప్‌ తుదిపోరులోనూ యువ భారత్‌ మట్టికరిపించింది. ఈ సారి కూడా అదే ఫలితం పునరావృతం అవుతుందని భారత అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు.

అద్భుత ఫామ్‌లో భారత్‌..
కాగా ప్రస్తుతం భారత జట్టు ఫామ్‌ను చూస్తుంటే ఆసీస్‌ను ఓడించి మరోసారి టైటిల్‌ను ఎగరేసుకోపోయేలా కన్పిస్తోంది. ఈ టోర్నీలో భారత్ ఒక్క మ్యాచ్​లో కూడా ఓడిపోకుండా ఫైనల్స్‌ చేరింది. భారత కెప్టెన్‌ ఉదయ్‌ సహారాన్‌, ముషీర్‌ ఖాన్‌, సచిన్‌ దాస్‌ వంటి యువ సంచలనాలు అద్భుత ఫామ్‌లో ఉండడం జట్టుకు కలిశిచ్చే అంశం​.

మరోవైపు బౌలర్లలో రాజ్‌ లింబానీ మరోసారి చెలరేగితే ఆసీస్‌ బ్యాటర్లకు కష్టాలు తప్పవు. అయితే ఆసీస్‌ను మాత్రం  తక్కువగా అంచనా వేయలేం. ఫైనల్‌ అంటే ఆసీస్‌కు పూనకాలే. పరిస్థితులు ఎలా ఉన్న ఆఖరి వరకు పోరాడడమే ఆసీస్‌ ప్రధాన అస్త్రం.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)