Breaking News

‘డ్రా’తో గట్టెక్కిన భారత్‌

Published on Tue, 07/30/2024 - 05:58

పారిస్‌: ఓటమి అంచుల్లో నుంచి భారత పురుషుల హాకీ జట్టు గట్టెక్కి ‘డ్రా’తో ఊపిరి పీల్చుకుంది. సోమవారం జరిగిన పూల్‌ ‘బి’ రెండో లీగ్‌ మ్యాచ్‌లో మాజీ ఒలింపిక్‌ చాంపియన్‌ అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్‌ను భారత్‌ 1–1తో ‘డ్రా’గా ముగించింది. ఆట 22వ నిమిషంలో లుకాస్‌ మార్టినెజ్‌ గోల్‌తో అర్జెంటీనా 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 36వ నిమిషంలో తమ ఆధిక్యాన్ని 2–0కు పెంచుకునే అవకాశం అర్జెంటీనాకు వచ్చిం ది. 

కానీ పెనాల్టీ స్ట్రోక్‌ను మైసో కసెల్లా వృథా చేశాడు. స్కోరును సమం చేసేందుకు భారత్‌ శక్తివంచన లేకుండా ప్రయతి్నంచింది. నిలకడగా పెనాల్టీ కార్నర్‌లు సంపాదించింది. కానీ వాటిని లక్ష్యానికి చేర్చడంలో విఫలమైంది. అయితే మరో నిమిషంలో ముగుస్తుందనగా భారత్‌కు 59వ నిమిషంలో తొమ్మిదో పెనాల్టీ కార్నర్‌ లభించింది. ఈ పెనాల్టీ కార్నర్‌ను కెపె్టన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ గోల్‌గా మలిచి స్కోరును సమం చేయడంతోపాటు భారత జట్టును ఓటమి నుంచి కాపాడాడు. నేడు జరిగే మూడో లీగ్‌ మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో భారత్‌ ఆడుతుంది.   

నేడు భారత క్రీడాకారుల షెడ్యూల్‌
హాకీ 
పురుషుల పూల్‌ ‘బి’ మ్యాచ్‌: భారత్‌ X ఐర్లాండ్‌ 
(సాయంత్రం గం. 4:45 నుంచి). 

ఆర్చరీ 
మహిళల వ్యక్తిగత 1/32 ఎలిమినేషన్‌ రౌండ్‌: అంకిత భకత్‌ X వియోలెటా (పోలాండ్‌) (సాయంత్రం గం. 5:15 నుంచి), భజన్‌ కౌర్‌ X సిఫా (ఇండోనేసియా) (సాయంత్రం గం. 5:30 నుంచి). పురుషుల వ్యక్తిగత 1/32 ఎలిమినేషన్‌ రౌండ్‌: బొమ్మదేవర ధీరజ్‌ X ఆడమ్‌ లీ (చెక్‌ రిపబ్లిక్‌) (రాత్రి గం. 10:45 నుంచి). 

బాక్సింగ్‌ 
పురుషుల 51 కేజీల ప్రిక్వార్టర్స్‌: అమిత్‌ పంఘాల్‌ X పాట్రిక్‌ చిన్‌యెంబా (జింబాబ్వే) (రాత్రి గం. 7:15 నుంచి). మహిళల 57 కేజీల మ్యాచ్‌: జైస్మిన్‌ లంబోరియా X నెస్థీ పెటెసియా (ఫిలిప్పీన్స్‌) (రాత్రి గం. 9:25 నుంచి). మహిళల 54 కేజీల ప్రిక్వార్టర్స్‌: ప్రీతి పవార్‌ X యెని మెర్సెలా (కొలంబియా) (అర్ధరాత్రి గం. 1.20 నుంచి).   

బ్యాడ్మింటన్‌ 
పురుషుల డబుల్స్‌ గ్రూప్‌ మ్యాచ్‌: సాతి్వక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి X అలి్ఫయన్‌ ఫజర్‌–మహమ్మద్‌ రియాన్‌ (ఇండోనేసియా) (సాయంత్రం గం. 5:30 నుంచి). మహిళల డబుల్స్‌ గ్రూప్‌ మ్యాచ్‌: అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో X సెట్యానా మాపసా–ఏంజెలా యూ (ఆ్రస్టేలియా) (సాయంత్రం గం. 6:20 నుంచి). 

షూటింగ్‌ 
ట్రాప్‌ పురుషుల క్వాలిఫికేషన్‌: పృథీ్వరాజ్‌ (మధ్యాహ్నం గం. 12:30 నుంచి). ట్రాప్‌ మహిళల క్వాలిఫికేషన్‌: శ్రేయసి సింగ్, రాజేశ్వరి కుమారి (మధ్యాహ్నం గం. 12:30 నుంచి). 
10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ కాంస్య పతక పోరు: భారత్‌ (మనూ భాకర్‌–సరబ్‌జోత్‌ సింగ్‌) ్ఠ దక్షిణ కొరియా (జిన్‌ ఓయె–లీ వన్‌హో) (మధ్యాహ్నం గం. 1:00 నుంచి). 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)