Breaking News

IND Vs PAK: మనదే పైచేయి

Published on Sat, 07/20/2024 - 07:21

దంబుల్లా: డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ ఆసియా కప్‌ టి20 క్రికెట్‌ టోరీ్నలో శుభారంభం చేసింది. పాకిస్తాన్‌పై తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటూ మరో విజయాన్ని అందుకుంది. శుక్రవారం జరిగిన గ్రూప్‌ ‘ఎ’ తొలి పోరులో భారత్‌ 7 వికెట్ల తేడాతో పాక్‌ను ఓడించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పాకిస్తాన్‌ 19.2 ఓవర్లలో 108 పరుగులకే కుప్పకూలింది. సిద్రా అమీన్‌ (35 బంతుల్లో 25; 3 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌. భారత బౌలర్లలో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దీప్తి శర్మ 3 వికెట్లు పడగొట్టగా...   రేణుక, శ్రేయాంక పాటిల్, పూజ వస్త్రకర్‌ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్‌ 14.1 ఓవర్లలో 3 వికెట్లకు 109 పరుగులు చేసింది. స్మృతి మంధాన (31 బంతుల్లో 45; 9 ఫోర్లు), షఫాలీ వర్మ (29 బంతుల్లో 40; 6 ఫోర్లు, 1 సిక్స్‌) తొలి వికెట్‌కు 57 బంతుల్లోనే 85 పరుగులు జోడించారు.   

టపటపా... 
భారత మహిళల పదునైన బౌలింగ్‌ ముందు పాక్‌ ఏమాత్రం నిలవలేకపోయింది. పూజ తన తొలి రెండు ఓవర్లలో 2 వికెట్లు తీసి ప్రత్యరి్థని నిలువరించగా, పవర్‌ప్లే ముగిసేసరికి పాక్‌ 37 పరుగులు చేసింది. కెప్టెన్‌ నిదా దార్‌ (8) ప్రభావం చూపలేకపోగా, రేణుక వరుస బంతుల్లో రెండు వికెట్లతో పాక్‌ను దెబ్బ కొట్టింది. ఈ దశలో తుబా, ఫాతిమా పోరాడి 25 బంతుల్లో 35 పరుగులు జత చేశారు. ఇన్నింగ్స్‌ 18వ ఓవర్లో 3 వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్‌...రాధ ఓవర్లో ఫాతిమా రెండు సిక్స్‌లు బాదడంతో 100 పరుగులు దాటింది. 47 పరుగుల వ్యవధిలో పాక్‌ చివరి 6 వికెట్లు చేజార్చుకుంది.  

ఒకే ఓవర్లో 21 పరుగులు... 
ఛేదనలో భారత ఓపెనర్లు షఫాలీ, స్మృతి దూకుడుగా ఆడారు. వరుసగా మూడు ఓవర్లలో రెండేసి ఫోర్లు రాగా...తుబా ఓవర్లో స్మృతి రెండు ఫోర్లు, షఫాలీ ఒక సిక్స్‌ బాదారు. ఫలితంగా 6 ఓవర్లలోనే స్కోరు 57 పరుగులకు చేరింది. ఆ తర్వాత తుబా వేసిన ఇన్నింగ్స్‌ 8వ ఓవర్లో స్మృతి చెలరేగింది. ఏకంగా ఐదు ఫోర్లు (4, 0, 4, 1 వైడ్, 4, 4, 4) బాదడంతో 21 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత 17 పరుగుల వ్యవధిలో స్మృతి, షఫాలీతో పాటు హేమలత (14) కూడా వెనుదిరిగినా...హర్మన్‌ (5 నాటౌట్‌), జెమీమా (3 నాటౌట్‌) కలిసి లాంఛనం పూర్తి చేశారు. గ్రూప్‌ ‘ఎ’లో భాగంగా జరిగిన మరో మ్యాచ్‌లో నేపాల్‌ ఆరు వికెట్ల తేడాతో యూఏఈ జట్టుపై విజయం సాధించింది. 

స్కోరు వివరాలు  
పాకిస్తాన్‌ ఇన్నింగ్స్‌: ఫేరోజా (సి) హర్మన్‌ (బి) పూజ 5; మునీబా (సి) రోడ్రిగ్స్‌ (బి) పూజ 11; సిద్రా (సి) రాధ (బి) రేణుక 25; ఆలియా (సి) రోడ్రిగ్స్‌ (బి) శ్రేయాంక 6; నిదా (సి) హేమలత (బి) దీప్తి 8; తుబా (సి) రాధ (బి) దీప్తి 22; ఇరమ్‌ (ఎల్బీ) (బి) రేణుక 0; ఫాతిమా (నాటౌట్‌) 22; అరూబ్‌ (రనౌట్‌) 2; నష్రా (సి) రిచా (బి) దీప్తి 0; సాదియా (బి) శ్రేయాంక 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (19.2 ఓవర్లలో ఆలౌట్‌) 108. వికెట్ల పతనం: 1–9, 2–26, 3–41, 4–59, 5–61, 6–61, 7–92, 8–94, 9–94, 10–108. బౌలింగ్‌: రేణుక 4–0–14–2, పూజ 4–0–31–2, దీప్తి శర్మ 4–0–20–3, రాధ  4–0–26–0, శ్రేయాంక పాటిల్‌ 3.2–0–14–2.  భారత్‌ ఇన్నింగ్స్‌: షఫాలీ (బి) అరూబ్‌ 40; స్మృతి (సి) ఆలియా (బి) అరూబ్‌ 45; హేమలత (సి) తుబా (బి) నష్రా 14; హర్మన్‌ (నాటౌట్‌) 5; జెమీమా (నాటౌట్‌) 3; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (14.1 ఓవర్లలో 3 వికెట్లకు) 109. వికెట్ల పతనం: 1–85, 2–100, 3–102. బౌలింగ్‌: సాదియా 2.1–0–18–0, ఫాతిమా 2–0–15–0, నిదా 1–0–10–0, తుబా 2–0–36–0, నష్రా 4–0–20–1, అరూబ్‌ 3–0–9–2.    

Videos

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)