Breaking News

టీమిండియా కెప్టెన్‌గా తిల‌క్ వ‌ర్మ‌.. బీసీసీఐ ప్ర‌కట‌న‌

Published on Sun, 09/14/2025 - 19:13

ఆస్ట్రేలియా-ఎతో జరగనున్న ​మూడు వన్డేల సిరీస్ కోసం భారత-ఎ జట్టును బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. అం‍త ఊహించనట్టుగానే ఆసీస్‌-ఎ సిరీస్‌లో టీమిండియా స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ఆడడం లేదు. తొలుతు ఆసీస్ పర్యటనకు ముందు  సన్నాహాల్లో భాగంగా ఈ అనాధికారిక సిరీస్‌లో రో-కో ద్వయం ఆడనున్నట్లు వార్తలు వినిపించాయి. 

కానీ ఈ సిరీస్ కోసం సెలక్టర్లు ప్రకటించిన తాజా స్క్వాడ్‌లో వీరిద్దరి పేర్లు లేకపోవడంతో అవన్నీ వట్టి రూమర్సే అని రుజువైంది. ఈ సిరీస్ కోసం రెండు వెర్వేరు జట్లను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. తొలి వన్డే కోసం 13 మంది సభ్యులతో కూడిన జట్టును మాత్రమే బీసీసీఐ సెలక్ట్ చేసింది.

ఆస్ట్రేలియా-ఎతో జరిగే తొలి వన్డేలో భారత-ఎ జట్టు కెప్టెన్ రజత్ పాటిదార్ వ్యవహరించనున్నాడు. అతడితో పాటు ఈ జట్టులో ఐపీఎల్ స్టార్లు ప్రియాన్ష్ ఆర్య,  ఆయూష్ బదోని, ప్రభుసిమ్రాన్  సింగ్‌, సిమర్జీత్ సింగ్, విప్రజ్ నిగమ్‌లకు చోటు దక్కింది.

కెప్టెన్‌గా తిలక్ వర్మ..
ఇక ఆఖరి రెండు మ్యాచ్‌లకు భారత-ఎ జట్టు కెప్టెన్‌గా హైదరాబాదీ తిలక్ వర్మను సెలక్టర్లు ఎంపిక చేశారు. తిలక్‌తో పాటు ఆసియాకప్ భారత జట్టులో భాగమైన అభిషేక్ శర్మ, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్‌లకు కూడా ఈ అనాధికరిక వన్డే సిరీస్‌లో ఆడనున్నారు. ఆసియాకప్ ముగిశాక వీరి నలుగురు నేరుగా ఇండియా-ఎ జట్టుతో కలవనున్నారు.

తొలి వన్డే జట్టులో భాగంగా ఉన్న ప్రియాన్ష్ ఆర్య, సిమర్జీత్ సింగ్‌లకు ఆఖరి రెండు వన్డేలకు ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు. ఇండియా-ఎ వర్సెస్ ఆసీస్‌-ఎ మధ్య మూడు వన్డేల సిరీస్ సెప్టెంబర్ 30 నుంచి ఆక్టోబర్ 5 మధ్య జరగనుంది. మొత్తం మూడు మ్యాచ్‌లు కాన్పూర్ వేదికగానే జరగనున్నాయి.

తొలి వన్డే కోసం భారత-ఎ జట్టు
రజత్ పాటిదార్ (కెప్టెన్‌), ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్‌), రియాన్ పరాగ్, ఆయుష్ బడోని, సూర్యాంశ్ షెడ్గే, విప్రజ్ నిగమ్, నిషాంత్ సింధు, గుర్జప్నీత్ సింగ్, యుధ్వీర్ సింగ్, రవి బిష్ణోయ్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్‌), ప్రియాంష్ ఆర్య, సిమర్‌జీత్ సింగ్.

రెండు, మూడు వన్డేల కోసం భారత- జట్టు
తిలక్ వర్మ (కెప్టెన్‌), రజత్ పాటిదార్ (వైస్ కెప్టెన్‌), అభిషేక్ శర్మ, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్‌), రియాన్ పరాగ్, ఆయుష్ బడోని, సూర్యాంశ్ షెడ్గే, విప్రజ్ నిగమ్, నిషాంత్ సింధు, గుర్జప్‌నీత్ సింగ్, యుధ్వీర్ సింగ్, రవి బిష్ణోయ్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్‌), హర్షిత్ రాణా
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)