Breaking News

రక్షించిన రహీమ్‌ అలీ

Published on Fri, 10/10/2025 - 04:28

సింగపూర్‌: ఆసియా ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఎఫ్‌సీ) ఆసియా కప్‌ క్వాలిఫయర్స్‌లో భారత ఫుట్‌బాల్‌ జట్టు ఆశలు సజీవంగా ఉంచుకుంది. మూడో రౌండ్‌లో భాగంగా గ్రూప్‌ ‘సి’లో పటిష్ట సింగపూర్‌తో మ్యాచ్‌ను భారత్‌ ‘డ్రా’ చేసుకుంది. గురువారం సింగపూర్‌తో జరిగిన పోరును భారత్‌ 1–1 గోల్స్‌తో ‘డ్రా’గా ముగించింది. భారత్‌ తరఫున రహీమ్‌ అలీ (90వ నిమిషంలో) అద్భుత గోల్‌ సాధించగా... సింగపూర్‌ తరఫున ఇఖ్‌సాన్‌ ఫండీ (45+1వ నిమిషంలో) ఓ గోల్‌ చేశాడు. 

కేవలం పది మంది ఆటగాళ్లతోనే ద్వితీయార్ధం మొత్తం పోరాడిన భారత్‌... ప్రత్యర్థిని నిలువరించడం విశేషం. ఖాలిద్‌ జమీల్‌ శిక్షణలోని భారత జట్టు... గొప్ప పోరాట పటిమ కనబర్చింది. మ్యాచ్‌ ఆరంభం నుంచి సింగపూర్‌ జట్టు ఆధిపత్యం సాగింది. 60 శాతానికి పైగా బంతిని నియంత్రణలో పెట్టుకున్న ఆ జట్టు... పకడ్బందీ పాసింగ్‌తో భారత డిఫెన్స్‌ను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. సొంతగడ్డపై పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆడిన సింగపూర్‌... చిన్నచిన్న పాస్‌లతో బంతిని ఏమారుస్తు మన డిఫెండర్లను బోల్తా కొట్టించింది. 

తొలి అర్ధభాగం ముగియడానికి క్షణాల ముందు ఇఖ్‌సాన్‌ ఫండీ భారత డిఫెన్స్‌ లోపాలను వాడుకుంటూ చక్కటి గోల్‌ చేయడంతో ఆతిథ్య జట్టు ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అప్పటికే భారత డిఫెండర్‌ సందేశ్‌ జింఘాన్‌కు రెఫరీ రెండుసార్లు యెల్లో కార్డు చూపడంతో... 47వ నిమిషంలో అతడు మైదానం వీడాల్సి వచ్చింది. అప్పటికే ప్రత్యర్థికి ఆధిక్యం అప్పగించుకున్న టీమిండియా... ఇక ఆ తర్వాత చివరి వరకు 10 మంది ప్లేయర్లతోనే ఆడింది. 

మ్యాచ్‌ మొత్తం 90 నిమిషాల్లో భారత జట్టుకు ఒక్కటంటే ఒక్క అవకాశం కూడా రాలేదు. ఇక సింగపూర్‌ విజయం ఖాయమైపోయిన దశలో సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగిన రహీమ్‌ అలీ అద్భుతం చేశాడు. అఖర్లో అవకాశం దక్కించుకున్న రహీమ్‌ చక్కటి గోల్‌తో భారత జట్టును పోటీలోకి తెచ్చాడు. దీంతో స్కోరు 1–1తో సమం కాగా... ఆ తర్వాత మిగిలిన సమయంలో ఇరు జట్లు ఎంత ప్రయత్నించినా మరో గోల్‌ సాధించలేకపోవడంతో మ్యాచ్‌ ‘డ్రా’గా ముగిసింది. 

గ్రూప్‌ ‘సి’లో ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లాడిన భారత్‌... హాంకాంగ్‌ చేతిలో ఓడి... బంగ్లాదేశ్, సింగపూర్‌లతో మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకొంది. 2 పాయింట్లతో పట్టిక మూడో స్థానంలో ఉంది. సింగపూర్‌ 5 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఒక్కో గ్రూప్‌లో టాప్‌లో నిలిచిన జట్టు మాత్రమే 2027 ఆసియాకప్‌నకు అర్హత సాధించనుంది. గ్రూప్‌ దశలో ఒక్కో జట్టు మిగిలిన మూడు జట్లతో ఇంటా బయట మ్యాచ్‌లు ఆడనుంది. ఇరు జట్ల మధ్య 14న గోవా వేదికగా రెండో మ్యాచ్‌ జరగనుంది.  

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)