చ‌రిత్ర సృష్టించిన టీమిండియా.. ఒకే రోజు 525 పరుగులు!

Published on Fri, 06/28/2024 - 18:49

చెపాక్ వేదికగా దక్షిణాఫ్రికా మహిళలతో జరుగుతున్న ఏ‍కైక టెస్టులో భారత బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. తొలి రోజు టీమిండియా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. మొదటి రోజు ఏకంగా టీమిండియా 4 వికెట్ల నష్టానికి 525 పరుగుల భారీ స్కోర్ సాధించింది. 

భారత బ్యాటర్లలో షఫాలీ వ‌ర్మ అద్బుత‌మైన డబుల్ సెంచ‌రీతో చెల‌రేగ‌గా.. స్మృతి మంధాన సెంచ‌రీతో మెరిసింది. 197 బంతులు ఎదుర్కొన్న షఫాలీ 27 ఫోర్లు, 8 సిక్స్‌లతో 205 పరుగులు చేయ‌గా.. మంధాన 161 బంతుల్లో 149 ప‌రుగులు చేసింది.

వీరితో పాటు జెమిమా రోడ్రిగ్స్(55) ప‌రుగుల‌తో రాణించింది. ప్ర‌స్తుతం క్రీజులో హ‌ర్మన్ ప్రీత్ కౌర్‌(42), రిచా ఘోష్‌(43) ప‌రుగుల‌తో ఉన్నారు. ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్ల‌లో డెల్మీ ట‌క్క‌ర్ రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. డీక్లార్క్ ఒక్క వికెట్ సాధించింది.

చ‌రిత్ర సృష్టించిన టీమిండియా..
ఇక ఈ మ్యాచ్‌లో అద్బుత ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచిన భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు అరుదైన రికార్డును త‌మ ఖాతాలో వేసుకుంది. పురుషుల‌, మ‌హిళ‌ల టెస్టు క్రికెట్‌లో ఒక రోజులో అత్య‌ధిక ప‌రుగులు చేసిన జ‌ట్టుగా భార‌త్ రికార్డుల‌కెక్కింది.

అంత‌కుముందు 2002లో బంగ్లాదేశ్‌పై శ్రీలంక ఒకే రోజులో 9 వికెట్లు కోల్పోయి 509 ప‌రుగులు చేసింది. తాజా మ్యాచ్‌తో లంకేయుల రికార్డును భార‌త మ‌హిళ‌లు బ‌ద్ద‌లు కొట్టారు. ఇప్ప‌టివ‌ర‌కు మ‌హిళ‌ల టెస్టు క్రికెట్‌లో అయితే 431 ప‌రుగులే అత్య‌ధిక కావడం గ‌మ‌నార్హం.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)