Breaking News

‘షూటౌట్‌’లో భారత్‌ ఓటమి

Published on Fri, 09/08/2023 - 03:05

చియాంగ్‌ మాయ్‌ (థాయ్‌లాండ్‌): కింగ్స్‌ కప్‌ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌లో భారత జట్టు మూడో స్థానం కోసం పోటీపడనుంది. ఇరాక్‌ జట్టుతో గురువారం జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో భారత జట్టు ‘పెనాల్టీ షూటౌట్‌’లో 4–5 గోల్స్‌ తేడాతో ఓడిపోయింది. నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు 2–2తో సమంగా నిలిచాయి. టోర్నీ నిబంధనల ప్రకారం అదనపు సమయం ఆడించకుండా నేరుగా ‘షూటౌట్‌’ ద్వారా ఫలితాన్ని నిర్ణయించారు.

‘షూటౌట్‌’లో తొలి షాట్‌ను భారత ప్లేయర్‌ బ్రాండన్‌ ఫెర్నాండెజ్‌ గోల్‌ పోస్ట్‌కు కొట్టాడు. ఆ తర్వాత సందేశ్‌ జింగాన్, సురేశ్, అన్వర్‌ అలీ, రహీమ్‌ అలీ గోల్స్‌ చేశారు. ఇరాక్‌ తరఫున ఐదుగురు ఆటగాళ్లూ గోల్స్‌ సాధించడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. అంతకుముందు భారత్‌ తరఫున మహేశ్‌ 16వ నిమిషంలో తొలి గోల్‌ చేశాడు. 28వ నిమిషంలో కరీమ్‌ అలీ గోల్‌తో ఇరాక్‌ స్కోరును 1–1తో సమం చేసింది.

51వ నిమిషంలో ఇరాక్‌ కెపె్టన్‌ జలాల్‌ హసన్‌ సెల్ఫ్‌ గోల్‌తో భారత్‌ 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. 79వ నిమిషంలో అయ్‌మెన్‌ గోల్‌తో ఇరాక్‌ 2–2తో స్కోరును సమం చేసింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 70వ స్థానంలో ఉన్న ఇరాక్‌పై భారత్‌ ఏనాడూ గెలవలేదు. ఇప్పటి వరకు రెండు జట్లు ఏడుసార్లు తలపడ్డాయి. ఆరు మ్యాచ్‌ల్లో ఇరాక్‌ నెగ్గగా, మరో మ్యాచ్‌ ‘డ్రా’ అయింది. లెబనాన్, థాయ్‌లాండ్‌ జట్ల మధ్య రెండో సెమీఫైనల్‌ పరాజిత జట్టుతో మూడో స్థానం కోసం భారత్‌ తలపడుతుంది.   

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)