Breaking News

భారత షూటర్ల పసిడి పంట

Published on Wed, 08/27/2025 - 05:56

షిమ్‌కెంట్‌ (కజకిస్తాన్‌): ఆసియా షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో ఇటు సీనియర్లు, అటు జూనియర్లు పసిడి పంట పండిస్తున్నారు. సీనియర్‌ మహిళల 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్‌లో ఒలింపియన్‌ సిఫ్ట్‌ కౌర్‌ సమ్రా వ్యక్తిగత, టీమ్‌ ఈవెంట్‌లో బంగారు పతకాలు గెలుచుకుంది. ఫైనల్లో 23 ఏళ్ల సిఫ్ట్‌ కౌర్‌ 459.2 స్కోరుతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది.

 టీమ్‌ విభాగంలో సిఫ్ట్‌ కౌర్‌ సమ్రా (589), ఆషి చౌక్సీ (586), అంజుమ్‌ మౌద్గిల్‌ (578)లతో కూడిన భారత బృందం మొత్తం 1753 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. క్వాలిఫయింగ్‌లో భారత్‌కే చెందిన శ్రీయాంక సదండి ‘టాప్‌’లో నిలిచింది. అయితే శ్రీయాంక ‘ర్యాంకింగ్‌ పాయింట్స్‌ ఓన్లీ’ (ఆర్‌పీఓ)లో పోటీపడటంతో పతకం బరిలో నిలిచే అవకాశం దక్కలేదు. ఆర్‌పీఓ షూటర్లకు మెడల్‌ రౌండ్‌ చాన్స్‌ ఉండదు. 
 
జూనియర్‌ ఈవెంట్‌లో షూటర్‌ అనుష్క ఠాకూర్‌ పసిడిపై గురిపెట్టి తొలిసారి అంతర్జాతీయ పతకాలతో డబుల్‌ ధమాకా సాధించింది. జూనియర్‌ మహిళల 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్‌లో 18 ఏళ్ల అనుష్క 460.7 స్కోరుతో ప్రథమ స్థానంలో నిలిచింది. అనుష్క (583), ప్రాచీ గైక్వాడ్‌ (588), మహిత్‌ సంధూ (587) బృందం 1758 స్కోరుతో పసిడి పతకాన్ని గెల్చుకుంది.  

జూనియర్‌ పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో సమీర్‌ కాంస్యం నెగ్గాడు. ఫైనల్లో సమీర్‌ 21 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. సమీర్, సూరజ్‌ శర్మ, అభినవ్‌ కలిసి టీమ్‌ ఈవెంట్‌లో పసిడి పతకం నెగ్గారు. జూనియర్‌ మహిళల ట్రాప్‌ ఈవెంట్‌లో హరీస్‌ సబీరా స్వర్ణం, ఆద్య రజతం నెగ్గారు. టీమ్‌ ఈవెంట్‌లో సబీర–ఆద్య–భవ్యలతో కూడిన త్రయం కూడా బంగారు పతకం గెలిచింది. ఆర్యవంశ్‌–అర్జున్‌–ఉద్ధవ్‌లతో కూడిన జూనియర్‌ పురుషుల టీమ్‌ కూడా పసిడి పతకం నెగ్గింది. ఓవరాల్‌గా భారత్‌ 31 స్వర్ణాలు, 11 రజతాలు, 14 కాంస్యాలతో కలిపి 56 పతకాలతో ‘టాప్‌’ ర్యాంక్‌లో కొనసాగుతోంది. 

Videos

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

Photos

+5

AP: సచివాలయ ఉద్యోగుల తిరుగుబాటు..!(ఫొటోలు)

+5

ఎర్రచీరలో అందంగా శోభిత చెల్లి సమంత (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం'లోని నారాయణమ్మ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

భర్తతో కలిసి మలేసియా ట్రిప్‌లో హీరోయిన్ అపర్ణ(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)