Breaking News

ఖోఖో ప్రపంచకప్‌ తొలి ఎడిషన్‌కు భారత్‌ ఆతిథ్యం

Published on Thu, 10/03/2024 - 17:21

ఖోఖో ప్రపంచకప్‌ తొలి ఎడిషన్‌కు భారత్‌ ఆతిథ్యమివ్వనుంది. వచ్చే ఏడాది జరగనున్న ఈ టోర్నమెంట్‌లో పదహారు పురుషుల, మహిళల జట్లు పాల్గొంటాయని భారత ఖోఖో సమాఖ్య బుధవారం వెల్లడించింది. 2032 నాటికి ఖోఖోకు ఒలింపిక్‌ క్రీడగా గుర్తింపు తీసుకొచ్చే దిశగా ఇది కీలక ముందడుగు అని పేర్కొంది. 

‘ఖోఖో మూలాలు భారత్‌లో ఉన్నాయి. ప్రాచీన క్రీడలో ప్రపంచకప్‌ నిర్వహించడం ద్వారా ఘన సాంస్కృతిక వారసత్వానికి తగిన గుర్తింపు లభిస్తుంది. మట్టి నుంచి ప్రారంభమై మ్యాట్‌ వరకు చేరిన ఈ క్రీడను ఇప్పుడు ప్రపంచంలో 54 దేశాలు ఆడుతున్నాయి. 

2032 నాటికి ఖోఖోకు ఒలింపిక్‌ క్రీడగా గుర్తింపు దక్కేలా చేయడమే మా అంతిమ లక్ష్యం. అందులో ప్రపంచకప్‌ తొలి అడుగు’ అని ఖోఖో సమాఖ్య అధ్యక్షుడు సుధాన్షు మిట్టల్‌ పేర్కొన్నాడు.  

క్వార్టర్‌ ఫైనల్లో భారత్‌
నాన్‌చాంగ్‌ (చైనా): ప్రపంచ జూనియర్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. టర్కీతో బుధవారం జరిగిన గ్రూప్‌ ‘ఇ’ చివరి లీగ్‌ మ్యాచ్‌లో భారత జట్టు 110–99 పాయింట్లతో విజయం సాధించింది. ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) ఈ టోర్నీలో ప్రయోగాత్మకంగా రిలే స్కోరింగ్‌ పద్ధతిని ప్రవేశపెట్టింది. 

ఇరు జట్ల మధ్య 10 మ్యాచ్‌లు జరుగుతుండగా... తొలుత 110 పాయింట్లు చేరిన జట్టు విజేతగా నిలుస్తుంది. టర్కీకంటే ముందు పెరూ, అజర్‌బైజాన్, మారిషస్‌లతో జరిగిన మ్యాచ్‌ల్లోనూ భారత జట్టు గెలిచింది. నేడు జరిగే క్వార్టర్‌ ఫైనల్లో ఇండోనేసియాతో భారత్‌ తలపడుతుంది.    

#

Tags : 1

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు