Breaking News

ప్రపంచకప్‌ చెస్‌ టోర్నీకి భారత్‌ ఆతిథ్యం 

Published on Tue, 07/22/2025 - 06:31

న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత్‌లో పురుషుల ప్రపంచకప్‌ చెస్‌ టోర్నమెంట్‌ జరుగనుంది. అక్టోబర్‌ 30 నుంచి నవంబర్‌ 27 వరకు ఈ టోర్నీని నిర్వహిస్తారు. అయితే వేదికను ఖరారు చేయాల్సి ఉంది. 23 ఏళ్ల తర్వాత ఈ మెగా ఈవెంట్‌కు భారత్‌ ఆతిథ్యమివ్వనుంది. చివరిసారి  2002లో హైదరాబాద్‌ వేదికగా ప్రపంచకప్‌ జరగ్గా... భారత దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ విజేతగా నిలిచాడు. అయితే ఈసారి జరగబోయేది క్యాండిడేట్స్‌ టోర్నీకి అర్హత సాధించే ప్రపంచకప్‌ ఈవెంట్‌.

 ఇందులో ప్రపంచవ్యాప్తంగా 206 మంది ఆటగాళ్లు తలపడతారు. ఇది నాకౌట్‌ టోర్నీ. ప్రతీ రౌండ్‌లో ఓడిన ఆటగాడు నిష్క్రమిస్తాడు. ‘కొన్నేళ్లపాటు చెస్‌ టోర్నీ వివిధ ఫార్మాట్లుగా జరిగింది. కానీ 2021 నుంచి నాకౌట్‌ పద్ధతిలోనే ప్రపంచకప్‌ నిర్వహిస్తున్నాం. ఒక రౌండ్‌ మూడు రోజుల పాటు జరుగుతుంది. రెండు క్లాసికల్‌ గేమ్‌లను నిర్వహిస్తారు. సమమైతే మూడో రోజు టైబ్రేక్‌ పోటీ ఉంటుంది’ అని అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య తెలిపింది. 2023లో అజర్‌బైజాన్‌లో జరిగిన ప్రపంచకప్‌లో కార్ల్‌సన్‌ (నార్వే) విజేతగా... ప్రజ్ఞానంద (భారత్‌) రన్నరప్‌గా నిలిచారు.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)