Breaking News

భారత్‌ ‘ఎ’ హ్యాట్రిక్‌ గెలుపు

Published on Thu, 10/24/2024 - 03:59

మస్కట్‌: ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన భారత ‘ఎ’ జట్టు ఎమర్జింగ్‌ ఆసియా కప్‌ టి20 క్రికెట్‌ టోర్నమెంట్‌లో హ్యాట్రిక్‌ విజయం నమోదు చేసుకుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఘనవిజయాలు సాధించిన తిలక్‌ వర్మ సారథ్యంలోని భారత ‘ఎ’ జట్టు మూడో మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగిస్తూ ఒమన్‌ను చిత్తు చేసింది. గ్రూప్‌ ‘బి’లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ ‘ఎ’ జట్టు 6 వికెట్ల తేడాతో ఒమన్‌పై గెలిచింది. 

ఈ టోర్నీలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన భారత్‌ ‘ఎ’ జట్టు 6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఒమన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. మొహమ్మద్‌ నదీమ్‌ (49 బంతుల్లో 41; 3 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌. భారత్‌ ‘ఎ’ బౌలర్లలో అఖీబ్‌ ఖాన్, రసిఖ్‌ సలామ్, నిషాంత్, రమణ్‌దీప్‌ సింగ్, సాయికిశోర్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో టీమిండియా 15.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. 

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఆయుష్‌ బదోనీ (27 బంతుల్లో 51; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు హాఫ్‌సెంచరీతో చెలరేగగా... కెప్టెన్ తిలక్‌ వర్మ (30 బంతుల్లో 36 నాటౌట్‌; ఒక ఫోర్, 2 సిక్సర్లు), అభిషేక్‌ శర్మ (15 బంతుల్లో 34; 5 ఫోర్లు, ఒక సిక్సర్‌) రాణించారు. శుక్రవారం జరగనున్న రెండో సెమీఫైనల్లో అఫ్గానిస్తాన్‌ ‘ఎ’ జట్టుతో భారత్‌ ‘ఎ’ తలపడనుంది.  
 

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)