Breaking News

ఏషియన్‌ గేమ్స్‌లో ఇవాళ టీమిండియాకు పతకాల పంట.. ఆల్‌టైమ్‌ రికార్డు

Published on Sun, 10/01/2023 - 21:14

ఏషియన్‌ గేమ్స్‌ 2023లో ఇవాళ (అక్టోబర్‌ 1) భారత్‌కు పతకాల పంట పండింది. ఈ రోజు టీమిండియా ఏకంగా 15 పతకాలు (3 స్వ​ర్ణాలు, 7 రజతాలు, 5 కాంస్యాలు) సాధించింది. ఏషియన్‌ గేమ్స్‌ హిస్టరీలో భారత్‌ ఒకే రోజు ఇన్ని పతకాలు సాధించడం ఇదే మొదటిసారి. 2010 గ్వాంగ్‌ఝౌ క్రీడల్లో 14వ రోజు భారత్‌ సాధించిన 11 పతకాలే ఇవాల్టి వరకు ఓ రోజులో భారత్‌ సాధించిన అత్యధిక పతకాలుగా ఉన్నాయి. దీని తర్వాత 2014 ఆసియా క్రీడల్లో 8వ రోజు భారత్‌ 10 పతాకలు సాధించింది. 2018 జకార్తా  క్రీడల్లో భారత్‌ 10వ రోజు 9 పతకాలు సాధించింది. 2010 గ్వాంగ్‌ఝౌ క్రీడల్లో 9వ రోజు భారత్‌ 9 పతకాలు సాధించింది.

ఇదిలా ఉంటే, ఇవాళే భారత్‌ పతకాల సంఖ్య కూడా 50 దాటింది. ప్రస్తుతం భారత్‌ ఖాతాలో 53 పతకాలు ఉన్నాయి. 13 స్వర్ణాలు, 21 రజతాలు, 19 కాంస్య పతకాలను భారత్‌ ఇప్పటిదాకా సొంతం చేసుకుంది. ప్రస్తుతం భారత్‌ పతకాల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుంది. 243 పతకాలతో చైనా (132 గోల్డ్‌, 72 సిల్వర్‌, 39 బ్రాంజ్‌) అగ్రస్థానంలో దూసుకుపోతుంది. 125 పతకాలతో (30, 35, 60) కొరియా రెండో స్థానంలో, 112 పతకాలతో (29, 41, 42) జపాన్‌ మూడో స్థానంలో కొనసాగుతున్నాయి. కాగా, 2018 క్రీడల్లో గెలిచిన 69 పతాకలే ఇప్పటివరకు భారత్‌ అత్యధిక పతకాల సంఖ్యగా కొనసాగుతుండగా.. ఈసారి క్రీడల్లో భారత్‌ ఈ రికార్డును సునాయాసంగా దాటి 100 పతకాల మార్కును తాకుందని అంచనా. ఈ ఎడిషన్‌లో ఇంకా వారం రోజులు మిగిలి ఉన్నాయి. 

ఇవాళ భారత్‌ సాధించిన స్వర్ణ పతకాలు..

  • పురుషుల ట్రాప్‌ టీమ్‌ షూటింగ్‌ (కైనన్‌ డేరియస్‌, జొరావర్‌ సింగ్‌, పృథ్వీరాజ్‌ తొండైమాన్‌)
  • అవినాశ్‌ సాబ్లే (పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌)
  • తజిందర్‌పాల్‌ సింగ్‌ తూర్‌ (మెన్స్‌ షాట్‌పుట్‌)

  
 

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)