Breaking News

రాజ్‌ కుమార్‌ హ్యాట్రిక్‌.. ఛాంపియన్స్‌ ట్రోఫీ సెమీస్‌లో భారత్‌

Published on Wed, 09/11/2024 - 19:18

చైనా వేదికగా జరుగుతున్న హీరో ఏషియన్‌ ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత హాకీ జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ టోర్నీలో భారత్‌ వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. తొలి మ్యాచ్‌లో చైనాను 3-0 తేడాతో మట్టికరిపించిన భారత్.. రెండో మ్యాచ్‌లో జపాన్‌ను 5-1 తేడాతో చిత్తు చేసింది. తాజాగా మలేసియాపై 8-1 గోల్స్‌ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్‌ సెమీఫైనల్స్‌కు అర్హత సాధించింది.

రాజ్‌ కుమార్‌ హ్యాట్రిక్‌
మలేసియాతో మ్యాచ్‌లో రాజ్‌ కుమార్‌ పాల్‌ హ్యాట్రిక్‌ గోల్స్‌ సాధించాడు. ఆట 3, 25, 33వ నిమిషాల్లో రాజ్‌ కుమార్‌ గోల్స్‌ చేశాడు. భారత్‌ తరఫున రాజ్‌ కుమార్‌తో పాటు అరైజీత్‌ సింగ్‌ హుండల్‌ 6, 39 నిమిషంలో, జుగ్‌రాజ్‌ సింగ్‌ 7వ నిమిషంలో, కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ 22వ నిమిషంలో, ఉత్తమ్‌ సింగ్‌ 40వ నిమిషంలో గోల్స్‌ సాధించారు.  మలేసియా సాధించిన ఏకైక గోల్‌ను అకీముల్లా అనువర్‌ 34వ నిమిషంలో సాధించాడు.

ఈ టోర్నీలో భారత్‌ తమ తదుపరి మ్యాచ్‌ల్లో కొరియా, పాకిస్తాన్‌లతో తలపడనుంది. కొరియాతో మ్యాచ్‌ సెప్టెంబర్‌ 12న.. పాక్‌తో మ్యాచ్‌ సెప్టెంబర్‌ 14న జరుగనున్నాయి. 

చదవండి: స్టిమాక్‌ కాంట్రాక్ట్‌ పునరుద్ధరణపై ఏఐఎఫ్‌ఎఫ్‌ విచారణ

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)