Breaking News

భారత్‌ను గెలిపించిన మునీరుల్‌

Published on Tue, 08/20/2024 - 09:12

లలిత్‌పూర్‌ (నేపాల్‌): దక్షిణాసియా ఫుట్‌బాల్‌ సమాఖ్య (శాఫ్‌) అండర్‌–20 చాంపియన్‌ప్‌లో భారత్‌ శుభారంభం చేసింది. గ్రూప్‌ ‘బి’లో భాగంగా సోమవారం జరిగిన తొలి లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 1–0 గోల్‌ తేడాతో భూటాన్‌ను ఓడించింది. భారత్‌ తరఫున మునీరుల్‌ మౌలా (37వ నిమిషంలో) ఏకైక గోల్‌ సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 

తొలి అర్ధభాగంలోనే గోల్‌ చేసి ఆధిక్యంలోకి దూసుకెళ్లిన భారత్‌ చివరి వరకు దాన్ని కాపాడుకుంది. అయితే ఒత్తిడికి గురైన భూటాన్‌ ఆటగాళ్లు పదే పదే భారత ప్లేయర్లతో వాగ్వాదానికి దిగగా... మనవాళ్లు కూడా దీటుగా బదులిచ్చారు. 

దీంతో ఇద్దరు భారత ఆటగాళ్లు, ఓ భూటాన్‌ ప్లేయర్‌కి రిఫరీ ‘రెడ్‌ కార్డు’ చూపి మైదానం నుంచి బయటకు పంపాడు. ఫలితంగా ఆట 67వ నిమిషం తర్వాత భారత్‌ కేవలం తొమ్మిది మంది ప్లేయర్లతోనే ఆధిక్యాన్ని కాపాడుకోవం విశేషం. శుక్రవారం జరిగే రెండో లీగ్‌ మ్యాచ్‌లో మాల్దీవులుతో భారత్‌ ఆడుతుంది. గ్రూప్‌ ‘ఎ’లో బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక జట్లున్నాయి.    

Videos

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు