ఆసియాకప్‌ మహిళల హాకీ ఫైనల్లో భారత్‌

Published on Sun, 09/14/2025 - 04:01

హాంగ్జౌ (చైనా): భారత మహిళల హాకీ జట్టు ఆసియా కప్‌ టోర్నమెంట్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ‘సూపర్‌–4’ దశ చివరి మ్యాచ్‌లో శనివారం డిఫెండింగ్‌ చాంపియన్‌ జపాన్‌తో పోరును భారత జట్టు 1–1 గోల్స్‌తో ‘డ్రా’ చేసుకుంది. భారత్‌ తరఫున బ్యూటీ డుంగ్‌ డుంగ్‌ 7వ నిమిషంలో గోల్‌ సాధించింది. చివరి క్వార్టర్‌ వరకు ఆధిక్యాన్ని కొనసాగించిన టీమిండియా... విజయం సాధించడం ఖాయమే అనుకుంటుండగా... 58వ నిమిషంలో కోబయకావా షిహో గోల్‌తో జపాన్‌ స్కోరు సమం చేసింది. 

ఇరు జట్ల మధ్య గ్రూప్‌ దశలో జరిగిన మ్యాచ్‌ సైతం ‘డ్రా’గానే ముగిసింది. మరో మ్యాచ్‌లో చైనా 1–0 గోల్స్‌ తేడాతో దక్షిణ కొరియాపై గెలవడంతో టీమిండియా ఫైనల్‌కు అర్హత సాధించింది. దీంతో ‘సూపర్‌–4’ దశలో మూడు మ్యాచ్‌లాడిన భారత్‌ ఒక విజయం, ఒక పరాజయం, ఒక ‘డ్రా’తో 4 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక రెండో స్థానంతో ఫైనల్లో అడుగుపెట్టింది. నేడు జరగనున్న ఫైనల్లో చైనాతో భారత్‌ తలపడనుంది. ఇందులో గెలిచిన జట్టు వచ్చే ఏడాది బెల్జియం, నెదర్లాండ్స్‌ వేదికగా జరగనున్న ప్రపంచకప్‌నకు నేరుగా అర్హత సాధిస్తుంది.  

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)