Breaking News

భారత్‌ X జపాన్‌

Published on Fri, 02/14/2025 - 04:20

కింగ్‌డావో (చైనా): ఆసియా మిక్స్‌డ్‌ టీమ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు కాంస్య పతకాన్ని నిలబెట్టుకునేందుకు విజయం దూరంలో నిలిచింది. నేడు జరిగే క్వార్టర్‌ ఫైనల్లో జపాన్‌ జట్టుతో భారత్‌ తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ గెలిస్తే సెమీఫైనల్లోకి ప్రవేశించి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంటుంది. గురువారం జరిగిన గ్రూప్‌ ‘డి’ చివరి లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 2–3తో దక్షిణ కొరియా జట్టు చేతిలో పోరాడి ఓడిపోయింది. 

తొలి మ్యాచ్‌లో ధ్రువ్‌ కపిల–తనీషా క్రాస్టో ద్వయం 21–11, 12–21, 15–21తో కి డాంగ్‌ జు–జియోంగ్‌ నా యున్‌ (కొరియా) జంట చేతిలో ఓడిపోయింది. రెండో మ్యాచ్‌లో మాళవిక బన్సోద్‌ 9–21, 10–21తో సిమ్‌ యు జిన్‌ చేతిలో పరాజయం పాలైంది. దాంతో భారత్‌ 0–2తో వెనుకబడింది. మూడో మ్యాచ్‌లో సతీశ్‌ కుమార్‌ కరుణాకరన్‌ 17–21, 21–18, 21–19తో చో జియోన్‌యోప్‌పై గెలుపొందాడు. 

నాలుగో మ్యాచ్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం 19–21, 21–16, 21–11తో కిమ్‌ ఇన్‌ జి–కిమ్‌ యు జుంగ్‌ జంటను ఓడించడంతో స్కోరు 2–2తో సమమైంది. నిర్ణాయక ఐదో మ్యాచ్‌లో సాతి్వక్‌ సాయిరాజ్‌–అర్జున్‌ జంట 14–21, 21–23తో జిన్‌ యోంగ్‌–నా సుంగ్‌ సెయోంగ్‌ జోడీ చేతిలో ఓడిపోవడంతో భారత ఓటమి ఖరారైంది. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)