Breaking News

రాణించిన అభిమన్యు, రాహుల్‌

Published on Mon, 06/09/2025 - 01:42

నార్తంప్టన్‌: ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ తొలి ఇన్నింగ్స్‌లో శతకంతో కదంతొక్కగా... రెండో ఇన్నింగ్స్‌లో అర్ధసెంచరీతో రాణించాడు. దీంతో భారత్‌ ‘ఎ’ భారీ ఆధిక్యంపై కన్నేసింది. ఇంగ్లండ్‌ లయన్స్‌తో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో భారత్‌ ‘ఎ’ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 33 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. కెప్టెన్‌ అభిమన్యు ఈశ్వరన్‌ (80; 10 ఫోర్లు), రాహుల్‌ (51; 9 ఫోర్లు) రెండో వికెట్‌కు 88 పరుగులు జోడించారు. 

మరో ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (5), మిడిలార్డర్‌లో కరుణ్‌ నాయర్‌ (15; 3 ఫోర్లు) విఫలమయ్యారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ధ్రువ్‌ జురేల్‌ (6 బ్యాటింగ్‌), నితీశ్‌ రెడ్డి (1 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. క్రిస్‌ వోక్స్‌కు 2 వికెట్లు దక్కాయి. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం కలుపుకొని భారత్‌ ప్రస్తుతం 184 పరుగులు ఆధిక్యంలో ఉంది. చేతిలో ఇంకా 6 వికెట్లున్నాయి.  

భారత్‌కు స్వల్ప ఆధిక్యం 
అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 192/3తో మూడో రోజు ఆదివారం ఆట ప్రారంభించిన ఇంగ్లండ్‌ లయన్స్‌ తొలి ఇన్నింగ్స్‌లో 89 ఓవర్లలో 327 పరుగుల వద్ద ఆలౌటైంది. భారత్‌కు 21 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. క్రితంరోజు బ్యాటర్లలో జోర్డాన్‌ కాక్స్‌ (45; 7 ఫోర్లు) మెరుగ్గా ఆడగా, కెప్టెన్‌ జేమ్స్‌ ర్యూ (10) విఫలమయ్యాడు. భారత బౌలర్లలో ఖలీల్‌ అహ్మద్‌ 4 వికెట్లు దక్కాయి.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)