Breaking News

13 పతకాలతో ముగింపు

Published on Thu, 10/02/2025 - 01:36

అహ్మదాబాద్‌: ఆసియా అక్వాటిక్స్‌ చాంపియన్‌షిప్‌ పోటీలను భారత్‌ 13 పతకాలతో ముగించింది. ఓవరాల్‌గా తొమ్మిదో స్థానంలో నిలిచిన భారత్‌కు నాలుగు రజతాలు, తొమ్మిది కాంస్యాలు లభించాయి. చివరిరోజు బుధవారం భారత్‌ ఖాతాలో నాలుగు కాంస్య పతకాలు చేరాయి. మహిళల 400 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో భవ్య సచ్‌దేవ (4ని:26.89 సెకన్లు) మూడో స్థానంలో నిలిచింది. పురుషుల 200 మీటర్ల బటర్‌ఫ్లయ్‌ ఈవెంట్‌లో సజన్‌ ప్రకాశ్‌ (1ని:57.90 సెకన్లు) కాంస్యం గెల్చుకున్నాడు. 

పురుషుల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో శ్రీహరి నటరాజ్‌ (55.23 సెకన్లు) కాంస్య పతకాన్ని సాధించాడు. శ్రీహరి నటరాజ్, రోహిత్‌ బెనెడిక్షన్, థామస్‌ దురై, ఆకాశ్‌ మణిలతో కూడిన భారత బృందం పురుషుల 4్ఠ100 మీటర్ల రిలేలో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. ఓవరాల్‌గా ఈ టోర్నీలో శ్రీహరి ఏకంగా ఏడు పతకాలు సాధించడం విశేషం. చైనా 49 పతకాలతో ‘టాప్‌’ ర్యాంక్‌ను అందుకోగా... 18 పతకాలతో జపాన్‌ రెండో స్థానంలో నిలిచింది.  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)