Breaking News

మనమే చాంపియన్స్‌

Published on Sun, 09/13/2026 - 23:25

దుబాయ్‌: ఫార్మాట్‌ ఏదైనా ఆసియా పరిధిలో తమకు ఎదురులేదని భారత మహిళల క్రికెట్‌ జట్టు నిరూపించింది. ఆసియాకప్‌ టి20 టోర్నీలో భారత జట్టు ఎనిమిదోసారి విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని భారత జట్టు 72 పరుగుల ఆధిక్యంతో డిఫెండింగ్‌ చాంపియన్‌ శ్రీలంక జట్టును ఓడించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత జట్టు నిరీ్ణత 20 ఓవర్లలో 5 వికెట్లకు 183 పరుగులు సాధించింది. 

ఓపెనర్లు షఫాలీ వర్మ (39 బంతుల్లో 68; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), స్మృతి మంధాన (39 బంతుల్లో 59; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీలతో అదరగొట్టారు. తొలి వికెట్‌కు వీరిద్దరు 129 పరుగులు జోడించారు. రిచా ఘోష్‌ (14; 1 ఫోర్‌), హర్మన్‌ప్రీత్‌ (17; 1 ఫోర్, 1 సిక్స్‌), కమలిని (5 బంతుల్లో 15 నాటౌట్‌; 1 ఫోర్, 1 సిక్స్‌) కూడా రాణించారు. అనంతరరం 184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టును భారత స్పిన్నర్లు దెబ్బ కొట్టారు. 

ఏదశలోనూ లక్ష్యం దిశగా సాగని శ్రీలంక సరిగ్గా 20 ఓవర్లు ఆడి 111 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి నల్లపురెడ్డి శ్రీచరణి 20 పరుగులిచ్చి 4 వికెట్లు, దీప్తి శర్మ 19 పరుగులిచ్చి 3 వికెట్లు తీశారు. వన్డే, టి20 ఫార్మాట్‌లు కలిపి ఆసియాకప్‌ ఇప్పటి వరకు 10 సార్లు జరిగింది. 10 సార్లు భారత జట్టు ఫైనల్‌కు చేరింది. వన్డే ఫార్మాట్‌లో భారత జట్టు 2004, 2005, 2006, 2008లలో విజేతగా నిలిచింది. టి20 ఫార్మాట్‌లో 2012, 2016, 2022, 2026లలో టైటిల్‌ గెలిచింది. 2018లో, 2024లలో టీమిండియా రన్నరప్‌గా 
నిలిచింది.

స్కోరు వివరాలు 
భారత్‌ ఇన్నింగ్స్‌: స్మృతి మంధాన (రనౌట్‌) 59; షఫాలీ వర్మ (సి) చమరి (బి) ప్రబోద 68; హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (సి) కవింది (సబ్‌) (బి) మిథాలీ అయోధ్య 14; రిచా ఘోష్‌ (సి) దిల్హారి (బి) చమరి 17; దీప్తి శర్మ (రనౌట్‌) 5; భారతి ఫుల్మాలి (నాటౌట్‌) 5; కమలిని (నాటౌట్‌) 15; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 182. 

వికెట్ల పతనం: 1–129, 2–132, 3–160, 4–166, 5–167. 

బౌలింగ్‌: మిథాలీ అయోధ్య 4–0–33–1, కవిషా దిల్హారి 3–0–29–0, సుగందిక కుమారి 4–0–31–0, చమరి అటపట్టు 4–0–34–1, చముడి ప్రబోద 4–0–40–1, నీలాక్షిక సిల్వా 1–0–15–0. 

శ్రీలంక ఇన్నింగ్స్‌: ఇమేశా దులాని (బి) క్రాంతి గౌడ్‌ 4; చమరి అటపట్టు (స్టంప్డ్‌) రిచా ఘోష్‌ (బి) దీప్తి శర్మ 36; విశ్మీ గుణరత్నే (బి) దీప్తి శర్మ 20; హర్షిత సమరవిక్రమ (సి అండ్‌ బి) శ్రీచరణి 9; నీలాక్షిక సిల్వా (సి) కమలిని (బి) శ్రీచరణి 22; కవిషా దిల్హారి (సి) నందని శర్మ (బి) శ్రీచరణి 7; హాసిని పెరీరా (సి) శ్రీచరణి (బి) షఫాలీ వర్మ 1; కౌషిని నుత్యాంగణ (బి) దీప్తి శర్మ 9; సుగందిక కుమారి (సి) నందని శర్మ (బి) శ్రీచరణి 1; మిథాలీ అయోధ్య (స్టంప్డ్‌) రిచా ఘోష్‌ (బి) ప్రేమ రావత్‌ 0; చముడి ప్రబోద (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో ఆలౌట్‌) 111. 

వికెట్ల పతనం: 1–4, 2–62, 3–63, 4–86, 5–100, 6–101, 7–103, 8–104, 9–107, 10–111. 
 

బౌలింగ్‌: క్రాంతి గౌడ్‌ 2–0–8–1, నందని శర్మ 3–0–17–0, షఫాలీ వర్మ 4–0–23–1, శ్రీచరణి 4–1–20–4, దీప్తి శర్మ 4–0–19–3, ప్రేమ రావత్‌ 3–0–22–1.  

ట్రోఫీ స్వీకరించేందుకు నిరాకరణ 
ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) చైర్మన్‌గా ఉన్న పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు అధ్యక్షుడు మోహసిన్‌ నఖ్వీ నుంచి ఆసియా కప్‌ ట్రోఫీని స్వీకరించేందుకు భారత క్రికెట్‌ జట్టు నిరాకరించింది. శ్రీలంక జట్టు క్రికెటర్లు మెడల్స్‌ను స్వీకరించిన తర్వాత బహుమతి ప్రదానోత్సవం ముగిసింది. 

Videos

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

చంద్రబాబుపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్

అప్పిరెడ్డికి భద్రత కూడా కల్పించలేమన్న జైలు అధికారులు

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బర్త్ డే సెలెబ్రేషన్స్

రామాయణ రికార్డుల జాతర

రామాయణం చిత్రంపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర పోస్ట్

బంగారం కొనాలా? వద్దా? రానున్న 15 రోజుల్లో ఏం జరగబోతుందంటే?

జైల్లోలేళ్ల అప్పి రెడ్డిని పరామర్శించిన అంబటి రాంబాబు

YSRCP ఏజెంట్లపై TDP నేతల దాడి.. రమేష్ గౌడ్ పరామర్శ

అత్తను పెండ్లి చేసుకున్న అల్లుడు

Photos

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)

+5

19 ఏళ్లకొకసారే ఇలా.. మంజుల బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

శ్రీకాంత్ కూతురిని చూశారా? ఎలా మెరిసిపోతోందో? (ఫొటోలు)

+5

జపాన్‌లో అత్తమామలతో కలిసి రష్మిక సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

టాలీవుడ్ సెలబ్రిటీస్ ఇంట్లో సందడిగా దీపావళి వేడుకలు (ఫొటోలు)

+5

బర్త్ డే ప్లస్ దీపావళి.. ఫ్యామిలీతో అనసూయ సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దివాళి ఫొటోలు పంచుకున్న భూమిక, ప్రగ్యా జైస్వాల్ (ఫొటోలు)

+5

దివాళి వేళ.. అనుపమ (ఫోటోలు)

+5

జాన్వీ ప్లాన్ చేసిన ఖుషి కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)