Breaking News

బంగ్లాదేశ్‌తో భారత్‌ మ్యాచ్‌ ‘డ్రా’

Published on Wed, 03/26/2025 - 03:51

షిల్లాంగ్‌: ఆసియా కప్‌–2027 క్వాలిఫయింగ్‌ టోర్నమెంట్‌ మూడో రౌండ్‌ను భారత జట్టు ‘డ్రా’తో ప్రారంభించింది. బంగ్లాదేశ్‌ జట్టుతో మంగళవారం జరిగిన మ్యాచ్‌ను భారత్‌ 0–0తో ‘డ్రా’గా ముగించింది. నిర్ణీత 90 నిమిషాల్లో రెండు జట్లు గోల్స్‌ చేయడంలో విఫలమయ్యాయి. తొలి అర్ధభాగంలో బంగ్లాదేశ్‌ దూకుడు ప్రదర్శించగా... రెండో అర్ధభాగంలో భారత్‌ జోరు కనబరిచింది. రెండు జట్లు గోల్స్‌ అవకాశాలు సృష్టించుకున్నా వాటిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాయి. 

68వ నిమిషంలో శుభాశీష్‌ బోస్, 81వ నిమిషంలో భారత కెప్టెన్ సునీల్‌ ఛెత్రి బంగ్లాదేశ్‌ గోల్‌పోస్ట్‌ లక్ష్యంగా కొట్టిన షాట్‌లు బయటకు వెళ్లాయి. గ్రూప్‌ ‘సి’లో భారత్‌తోపాటు బంగ్లాదేశ్, హాంకాంగ్, సింగపూర్‌ జట్లున్నాయి. భారత్‌ తమ తదుపరి మ్యాచ్‌ను జూన్‌ 10న సింగపూర్‌తో ఆడుతుంది. గ్రూప్‌ ‘సి’లో అగ్రస్థానంలో నిలిచిన జట్టు 2027 ఆసియా కప్‌ టోర్నీకి అర్హత సాధిస్తుంది.   
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)