Breaking News

రుతపర్ణ–శ్వేతపర్ణ జోడీ ఓటమి

Published on Wed, 07/16/2025 - 04:11

టోక్యో: జపాన్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత్‌కు శుభారంభం లభించలేదు. టోర్నీ తొలి రోజు మహిళల డబుల్స్‌ విభాగంలో ‘పాండా సిస్టర్స్‌’ జోడీ రుతపర్ణ–శ్వేతపర్ణ తొలి రౌండ్‌లోనే వెనుదిరిగింది. కొకోనా ఇషికావా–మైకో కవాజోయి (జపాన్‌) ద్వయంతో జరిగిన మ్యాచ్‌లో ఒడిశాకు చెందిన రుతపర్ణ–శ్వేతపర్ణ 13–21, 7–21తో ఓడిపోయింది. 

32 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో రెండు గేముల్లో ఆరంభ దశలో రుతపర్ణ–శ్వేతపర్ణ ఆకట్టుకున్నా... ఆ తర్వాత తడబడ్డారు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో దక్షిణ కొరియా ప్లేయర్, ప్రపంచ 14వ ర్యాంకర్‌ సిమ్‌ జు యున్‌తో పీవీ సింధు... ప్రపంచ 7వ ర్యాంకర్‌ పోర్న్‌పవీ చోచువోంగ్‌ (థాయ్‌లాండ్‌)తో ఉన్నతి హుడా; రక్షిత శ్రీతో అనుపమ పోటీపడతారు. 

మరోవైపు పురుషుల సింగిల్స్‌లో తొలి రౌండ్‌లో చైనా ప్లేయర్‌ వాంగ్‌ జెంగ్‌ జింగ్‌తో లక్ష్య సేన్‌ ఆడతాడు. పురుషుల డబుల్స్‌లో భారత్‌ నుంచి సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి; హరిహరన్‌–రూబన్‌ కుమార్‌ జోడీలు పోటీపడుతున్నాయి. తొలి రౌండ్‌లో కాంగ్‌ మిన్‌ హియుక్‌–కి డాంగ్‌ జు (దక్షిణ కొరియా)లతో సాతి్వక్‌–చిరాగ్‌; కిమ్‌ వన్‌ హో–సియో సెంగ్‌ జే (దక్షిణ కొరియా)లతో హరిహరన్‌–రూబన్‌ తలపడతారు. 
 

#

Tags : 1

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)