Breaking News

యువరాజ్‌ మళ్లీ ఫెయిల్‌.. సెమీఫైనల్లో టీమిండియా

Published on Thu, 07/11/2024 - 11:31

వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టోర్నీలో ఇండియా ఛాంపియ‌న్స్ వ‌రుస‌గా మూడో ఓట‌మి చ‌విచూసింది. బుధవారం నార్తాంప్టన్ వేదిక‌గా దక్షిణాఫ్రికా ఛాంపియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 54 పరుగుల తేడాతో  ఇండియా ఓటమి పాలైంది. 

210 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన టీమిండియా.. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి 156 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. భార‌త బ్యాట‌ర్ల‌లో యూస‌ఫ్ ప‌ఠాన్, ఇర్ఫాన్‌ పఠాన్‌ ఆఖరిలో మెరుపులు మెరిపించినప్పటకి జట్టును మాత్రం గెలిపించలేకపోయారు. 

యూస‌ఫ్ ప‌ఠాన్(44 బంతుల్లో54, 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఇర్ఫాన్‌(21 బంతుల్లో 35, 4 ఫోర్లు, ఒక సిక్స్‌) పోరాడనప్పటకి అప్పటికే మ్యాచ్‌ భారత్‌ చేదాటిపోయింది. కెప్టెన్ యువరాజ్ సింగ్(5) మ‌రోసారి ఫెయిల్ అయ్యాడు. 

దక్షిణాఫ్రికా బౌలర్లలో ఫిలిండర్‌ రెండు వికెట్లు పడగొట్టగా.. చార్ల్ లాంగెవెల్డ్ట్, తహీర్‌,స్నైమెన్‌ తలా వికెట్‌ సాధించారు. అంతకముందు బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. 

సఫారీ బ్యాటర్లలో స్నైమెన్‌(73) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. లివీ(25 బంతుల్లో 60, 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరుపులు మెరిపించాడు. భారత బౌలర్లలో హర్భజన్‌ సింగ్‌ నాలుగు వికెట్లు పడగొట్టగా.. కులకర్ణి, వినయ్‌కుమార్‌, యూసఫ్‌ తలా వికెట్‌ సాధించారు.

సెమీస్‌లో భారత్‌..
ఇక ఈ మ్యాచ్‌లో ఓటమి పాలైనప్పటికి సెమీఫైనల్లో భారత్‌ అడుగుపెట్టింది. పాయింట్ల పట్టకలో నాలుగో స్ధానంలో భారత్‌ నిలిచి సెమీస్‌ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఈ టోర్నీలో చెరో రెండు విజయాలు సాధించిన భారత్‌, దక్షిణాఫ్రికా జట్లు పాయింట్ల పరంగా సమంగా నిలిచాయి.

 అయితే దక్షిణాఫ్రికా(-1.340) రన్‌రేట్‌ కంటే భారత్‌(-1.267)రన్‌రేట్‌  మెరుగ్గా ఉండడంతో సెమీస్‌కు యువీ సేన ఆర్హత సాధించింది. జూలై 12న నార్తాంప్టన్ వేదికగా ఆస్ట్రేలియా ఛాంపియన్స్‌ భారత్‌ తలపడనుంది.
 

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)