జస్ప్రీత్‌ బుమ్రాకు గాయం.. కీలక అప్‌డేట్‌ ఇచ్చిన బౌలింగ్‌ కోచ్‌

Published on Sun, 12/08/2024 - 07:53

అడిలైడ్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పేస్ గుర్రం జ‌స్ప్రీత్ బుమ్రా బౌలింగ్ చేస్తూ ఇబ్బంది ప‌డిన విష‌యం సంగ‌తి తెలిసిందే. రెండో రోజు ఆట‌లో బుమ్రా తొడ కండ‌రాలు ప‌ట్టేశాయి.

దీంతో బౌలింగ్ చేయ‌డానికి వ‌చ్చిన బుమ్రా నొప్పితో కిందపడిపోయాడు. వెంట‌నే ఫిజియో వ‌చ్చి చికిత్స అందించడంతో బుమ్రా మ‌ళ్లీ త‌న బౌలింగ్‌ను కొన‌సాగించాడు. దీంతో భార‌త అభిమానులు ఆందోళ‌న చెందారు.

తాజాగా బుమ్రా గాయంపై భార‌త బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. బుమ్రాకు ఎలాంటి గాయం కాలేద‌ని, అత‌డు కొంచెం నొప్పితో బాధ‌ప‌డ్డాడ‌ని మోర్కెల్ స్ప‌ష్టం చేశాడు.

"బుమ్రాకు ఎటువంటి గాయం కాలేదు. అత‌డు బాగానే ఉన్నాడు. ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదు. అతనికి తిమ్మిర్లు వచ్చాయి. అందుకే ఫిజియో వ‌చ్చి చికిత్స అందించాడు. ఆ త‌ర్వాత అత‌డు త‌న బౌలింగ్‌ను కొన‌సాగించి వికెట్లు కూడా తీశాడు.

టెస్టు క్రికెట్‌లో ఆట‌గాళ్ల గాయాల‌ను దాచ‌లేమ‌ని" విలేక‌రుల స‌మావేశంలో మోర్క‌ల్ పేర్కొన్నాడు. కాగా జస్ప్రీత్‌ బుమ్రా భారత జట్టులో ప్రధాన బౌలర్‌గా కొనసాగతున్నాడు. ఇప్పటికే ఈ సిరీస్‌లో తన మార్క్‌ను ఈ సౌరాష్ట్ర పేసర్‌ చూపించాడు. మొత్తం మూడు ఇన్నింగ్స్‌లో 11 వికెట్లు పడగొట్టాడు.

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)