Breaking News

ప్రాణాపాయ స్థితిలో ఐర్లాండ్‌ టాప్‌ క్రికెటర్‌.. ఇండియాలో చికిత్స

Published on Thu, 09/05/2024 - 13:38

ఐర్లాండ్‌ టాప్‌ క్రికెటర్‌ సిమ్రన్‌జిత్‌ సింగ్‌ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. అతడి కాలేయం పూర్తిగా దెబ్బతిన్నట్లు సమాచారం. ప్రస్తుతం అతడు గురుగ్రామ్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే సిమ్రన్‌జిత్‌కు కాలేయ మార్పిడి జరుగనుందని.. ఆస్పత్రి సిబ్బంది ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తిచేసినట్లు జాతీయ మీడియా వెల్లడించింది.

మొహాలీ నుంచి ఐర్లాండ్‌కు 
సిమి సింగ్‌గా ప్రసిద్ధి చెందిన సిమ్రన్‌జిత్‌ సింగ్‌ భారత్‌లోని పంజాబ్‌లో గల మొహాలిలో జన్మించాడు. చిన్ననాటి నుంచే క్రికెట్‌పై మక్కువ పెంచుకున్న సిమి.. దేశవాళీ క్రికెట్‌ ఆడాడు. అండర్‌-14, అండర్‌-17 స్థాయిలో పంజాబ్‌కు ప్రాతినిథ్యం వహించాడు.

అయితే, ఈ లెగ్‌ స్పిన్‌ ఆల్‌రౌండర్‌కు భారత అండర్‌-19 జట్టులో మాత్రం చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో.. చదువుపై దృష్టి సారించిన సిమి.. 2005లో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చదివేందుకు ఐర్లాండ్‌కు వెళ్లిపోయాడు. ఆ మరుసటి ఏడాది డబ్లిన్‌లో ప్రొఫెషనల్‌ క్రికెటర్‌ మారిన అతడు.. 2017లో ఐర్లాండ్‌ జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు.

సౌతాఫ్రికాపై శతకం బాది
అద్భుత ప్రదర్శనలతో జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగిన 37 ఏళ్ల సిమి.. ఐర్లాండ్‌ టాప్‌ క్రికెటర్‌గా ప్రశంసలు అందుకున్నాడు. మొత్తంగా ఇప్పటి వరకు 35 వన్డేల్లో 39, 53 టీ20లలో 44 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. అంతేకాదు.. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో శతకం బాది సంచలనం సృష్టించాడు. 

ప్రపంచస్థాయి బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని సిమి వంద పరుగుల మార్కు అందుకున్న తీరు క్రికెట్‌ అభిమానులను అలరించింది. ఇక 2020లో ఐర్లాండ్‌ సెంట్రల్‌ కాంట్రాక్టు దక్కించుకున్న సిమి సింగ్‌.. ప్రస్తుతం చావుతో పోరాడుతున్నట్లు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా వెల్లడించింది.  అతడి లివర్‌ పూర్తిగా పాడైపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారని పేర్కొంది. 

భార్య కాలేయదానం
కాగా సిమి భార్య అగమ్‌దీప్‌ కౌర్‌ అతడికి కాలేయదానం చేసేందుకు ముందుకు వచ్చింది. డబ్లిన్‌లో ఉద్యోగం చేస్తున్న ఆమె భర్తను కాపాడుకునేందుకు ఇండియాకు వచ్చినట్లు తెలుస్తోంది. కాగా ఐర్లాండ్‌లో ఉన్నపుడు ఎన్ని మందులు వాడినా జ్వరం తగ్గకపోవడంతో ఆస్పత్రికి వెళ్లగా.. డాక్టర్లకు సిమి సమస్య అర్థం కాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. అందుకే అతడిని భారత్‌కు తీసుకువచ్చి చికిత్స చేయిస్తున్నట్లు వెల్లడించారు.

చదవండి: T20 WC Qualifiers: పెను సంచ‌ల‌నం.. 10 ప‌రుగుల‌కే ఆలౌట్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)