చరిత్ర సృష్టించిన టీమిండియా.. 70 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి

Published on Tue, 06/24/2025 - 08:09

లీడ్స్ వేదిక‌గా ఇంగ్లండ్‌-భార‌త్ మ‌ధ్య జ‌రుగుతున్న తొలి టెస్టు ర‌స‌వత్త‌ర ముగింపున‌కు చేరుకుంది. ఇంగ్లండ్ త‌మ విజ‌యానికి 350 ప‌రుగులు దూరంలో ఉండ‌గా.. టీమిండియా 10 వికెట్ల దూరంలో నిలిచింది. నాలుగో రోజు ఆట ముగిసే స‌మయానికి ఇంగ్లండ్ వికెట్ న‌ష్ట‌పోకుండా 21 ప‌రుగులు చేసింది.

క్రీజులో జాక్‌ క్రాలీ (12 బ్యాటింగ్‌), బెన్‌ డకెట్‌ (9 బ్యాటింగ్‌) ఉన్నారు. అంత‌కముందు భార‌త్ త‌మ రెండో ఇన్నింగ్స్‌లో 364 పరుగులకు ఆలౌటైంది. కేఎల్‌ రాహుల్‌ (247 బంతుల్లో 137; 18 ఫోర్లు), రిషభ్‌ పంత్‌ (140 బంతుల్లో 118; 15 ఫోర్లు, 3 సిక్స్‌లు) శత‌క్కొట్టారు.

ఈ టెస్టులో పంత్‌కు ఇది రెండో సెంచ‌రీ. ఇక తొలి ఇన్నింగ్స్‌లో ల‌భించిన 6 ప‌రుగుల ఆధిక్యాన్ని జోడించి ఇంగ్లండ్ ముందు 371 ప‌రుగుల ల‌క్ష్యాన్ని భార‌త్ ఉంచింది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండ‌డంతో మ‌రోసారి బౌల‌ర్ల‌కు మ‌రోసారి క‌ఠిన స‌వాలు త‌ప్ప‌దు. బుమ్రాకు తోడుగా సిరాజ్‌, ప్ర‌సిద్ద్ కృష్ణ రాణించాల్సిన అవసరముంది.

93 ఏళ్ల చరిత్రలోనే..
ఇక ఈ లీడ్స్ టెస్టులో భారత జట్టు చారిత్రాత్మక రికార్డు సృష్టించింది. ఒక టెస్టు మ్యాచ్‌లో టీమిండియా తరపున ఐదు సెంచరీలు నమోదు కావడం ఇదే తొలిసారి. 1932 నుంచి టెస్టు క్రికెట్ ఆడుతున్న భారత జట్టు.. 93 ఏళ్ల తర్వాత ఈ అరుదైన ఫీట్‌ను అందుకుంది.

గతంలో భారత్ తరపున ఒక టెస్టు మ్యాచ్‌లో నాలుగు సెంచరీలు నమోదైన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఐదు సెంచరీలు రావడం మొదటి సారి. తొలి ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్, శుబ్‌మన్‌ గిల్, రిషభ్‌ పంత్‌ సెంచరీలు చేయగా...రెండో ఇన్నింగ్స్‌లో  కేఎల్‌ రాహుల్, పంత్‌ శతకాలు బాదారు.

అదేవిధంగా 1955 తర్వాత విదేశీ గడ్డపై ఒకే టెస్టు మ్యాచ్‌లో ఐదు సెంచరీలు చేసిన పర్యాటక జట్టుగా భారత్ నిలిచింది. 70 ఏళ్ల కిందట వెస్టిండీస్ టూర్‌లో ఒకే టెస్టులో ఐదుగురు ఆస్ట్రేలియన్ ఆటగాళ్ళు మూడు అంకెల స్కోర్‌ను అందుకున్నారు.
చదవండి: గుండెపోటుతో భారత మాజీ క్రికెట‌ర్ క‌న్నుమూత‌
 

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)