Breaking News

పాక్‌ను చిత్తుగా ఓడించిన భారత్‌

Published on Sat, 07/25/2026 - 13:15

ఎఫ్‌ఐహెచ్ యూత్ హాకీ5స్ ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత సబ్‌జూనియర్ బాలుర జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై 7-3 తేడాతో ఘన విజయం సాధించింది. ఇదే రోజు ఆతిథ్య ఒమాన్‌ను 10-1తో చిత్తు చేసి వరుస విజయాలతో అదరగొట్టింది.

పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోమిత్ పాల్, కరణ్ గౌతమ్, కెప్టెన్ కేతన్ కుష్వాహా తొలి అర్ధభాగంలోనే గోల్స్ చేసి భారత్‌కు 3-0 ఆధిక్యం అందించారు. అనంతరం ప్రహ్లాద్ రాజ్‌భర్, షారుఖ్ అలీ, రాహుల్ యాదవ్, కేతన్ కుష్వాహా మరోసారి గోల్స్ చేయడంతో భారత్ సునాయాసంగా విజయం సాధించింది.

అంతకుముందు ఒమాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కేతన్ కుష్వాహా నాలుగు గోల్స్‌తో మెరవగా, షారుఖ్ అలీ, కరణ్ గౌతమ్, ప్రహ్లాద్ రాజ్‌భర్ తలో రెండు గోల్స్ చేసి భారత్‌కు 10-1 తేడాతో భారీ విజయాన్ని అందించారు.

మరోవైపు బాలికల ఎలైట్ పూల్ మ్యాచ్‌లో భారత సబ్‌జూనియర్ జట్టు చైనాతో పోరాడినా 3-6 తేడాతో ఓటమి పాలైంది. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి స్కోరు 3-3తో సమంగా ఉన్నప్పటికీ, రెండో అర్ధభాగంలో చైనా ఆధిపత్యం చెలాయించి విజయాన్ని అందుకుంది.

ఈ టోర్నీ ద్వారా ప్రారంభ ఎఫ్‌ఐహెచ్ యూత్ హాకీ5స్ ప్రపంచకప్‌కు ఆసియా జట్ల ఎంపిక కూడా జరగనుంది.

 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)