Breaking News

అద‌ర‌గొట్టిన అరుంధతి.. ఆసీస్‌పై భార‌త్ ఘ‌న విజ‌యం

Published on Sun, 02/15/2026 - 17:47

ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌ను భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు విజ‌యంతో ఆరంభించింది. ఆదివారం సిడ్నీ వేదిక‌గా జ‌రిగిన తొలి టీ20లో ఆసీస్‌పై డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ద‌తి ప్ర‌కారం భార‌త్ 21 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. భార‌త బౌల‌ర్ల దాటికి 18 ఓవ‌ర్ల‌లో 133 ప‌రుగుల‌కే కుప్పకూలింది.

కంగారూ జ‌ట్టు బ్యాట‌ర్ల‌లో జార్జియా వేర్‌హామ్(30) టాప్ స్కోర‌ర్‌గా నిలవ‌గా, లిచ్‌ఫీల్డ్‌(26), పెర్రీ(20) రాణించారు. భార‌త పేస‌ర్ అరుంధ‌తి రెడ్డి నాలుగు వికెట్లు ప‌డ‌గొట్టి ఆసీస్ ప‌త‌నాన్ని శాసించింది. అరుధ‌తితో పాటు మ‌రో తెలుగు అమ్మాయి శ్రీ చరణి, పేస‌ర్ రేణుకా సింగ్ ఠాకూర్ త‌లా రెండు వికెట్లు సాధించారు.

అనంత‌రం స్వ‌ల్ప ల‌క్ష్యంతో బరిలోకి దిగిన భార‌త్‌కు ఓపెన‌ర్ ష‌ఫాలీ వ‌ర్మ త‌న మెరుపు బ్యాటింగ్‌తో అద్భుత‌మైన ఆరంభాన్ని ఇచ్చింది. ష‌ఫాలీ కేవ‌లం 11 బంతుల్లోనే 2 సిక్స‌ర్ల‌తో 21 ప‌రుగులు చేసి ఔటైంది. అయితే భార‌త్ స్కోర్ 50/1 (5.1 ఓవర్లలో) వ‌ద్ద ఉండ‌గా వర్షం కారణంగా ఆట నిలిచిపోయింది.

వ‌ర్షం త‌గ్గుముఖం ప‌ట్టే సూచ‌న‌లు క‌న్పించ‌క‌పోవ‌డంతో డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ద‌తిలో ఫ‌లితాన్ని తేల్చాల్సి వ‌చ్చింది. ఆట నిలిచిపోయే స‌మ‌యానికి 21 ప‌రుగులు ముందుంజ‌లో ఉండ‌డంతో భార‌త్‌ను విజేత‌గా నిర్ణ‌యించారు. ఈ విజ‌యంతో 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి హ‌ర్మ‌న్ సేన దూసుకెళ్లింది. రెండో టీ20 కాన్‌బెర్రా వేదిక‌గా ఫిబ్ర‌వ‌రి 19న జ‌ర‌గ‌నుంది.

Videos

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు