Breaking News

ఫైనల్‌పై భారత్‌ గురి

Published on Fri, 11/28/2025 - 03:59

ఇపో (మలేసియా): అందివచ్చిన అవకాశాలను సది్వనియోగం చేసుకున్న భారత పురుషుల హాకీ జట్టు సుల్తాన్‌ అజ్లాన్‌ షా కప్‌ టోర్నీలో ఫైనల్‌ బెర్త్‌పై గురి పెట్టింది. న్యూజిలాండ్‌తో గురువారం జరిగిన నాలుగో లీగ్‌ మ్యాచ్‌లో సంజయ్‌ సారథ్యంలోని టీమిండియా 3–2 గోల్స్‌ తేడాతో గెలిచింది. ఈ టోర్నీలో భారత్‌కిది మూడో విజయం. భారత్‌ తరఫున అమిత్‌ రోహిదాస్‌ (4వ నిమిషంలో), సంజయ్‌ (32వ నిమిషంలో), సెల్వం కార్తీ (54వ నిమిషంలో) ఒక్కో గోల్‌ చేశారు. 

న్యూజిలాండ్‌ జట్టుకు జార్జి బాకెర్‌ (42వ, 48వ నిమిషాల్లో) రెండు గోల్స్‌ అందించాడు. ఆరు జట్లు పోటీపడుతున్న ఈ టోర్నీలో నాలుగు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న భారత్‌ తొమ్మిది పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. బెల్జియం జట్టు పది పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లో... న్యూజిలాండ్‌ ఏడు పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాయి. రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ మ్యాచ్‌లు ముగిశాక తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. 

నేడు మ్యాచ్‌లకు విశ్రాంతి దినం. శనివారం జరిగే చివరి రౌండ్‌ లీగ్‌ మ్యాచ్‌ల్లో కెనడాతో భారత్‌; బెల్జియంతో న్యూజిలాండ్‌; మలేసియాతో దక్షిణ కొరియా ఆడతాయి. కెనడాపై భారత్‌ గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా ఫైనల్‌ చేరుకుంటుంది. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ను బెల్జియం ‘డ్రా’ చేసుకున్నా భారత్‌తో కలిసి ఫైనల్లోకి అడుగు పెడుతుంది. బెల్జియంపై 13 గోల్స్‌ తేడాతో గెలిస్తేనే న్యూజిలాండ్‌కు ఫైనల్‌ చేరే అవకాశం ఉంటుంది.   

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి