Breaking News

చాంపియన్‌ భారత్‌

Published on Wed, 07/05/2023 - 05:34

బెంగళూరు: దక్షిణాసియా ఫుట్‌బాల్‌లో భారత జట్టు మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. దక్షిణాసియా ఫుట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ (శాఫ్‌)లో తొమ్మిదోసారి భారత జట్టు చాంపియన్‌గా నిలి చింది. మంగళవారం జరిగిన ఫైనల్లో సునీల్‌ ఛెత్రి కెప్టెన్సీలోని టీమిండియా ‘పెనాల్టీ షూటౌట్‌’లో 5–4తో కువైట్‌ జట్టును ఓడించింది. కువైట్‌ పశి్చమ ఆసియా దేశమైనా పోటీతత్వం పెరగాలనే ఉద్దేశంతో దక్షిణాసియా టోరీ్నకి ఆ జట్టును ప్రత్యేకంగా ఆహా్వనించారు. లీగ్‌ దశలో కువైట్‌తో జరిగిన మ్యాచ్‌ను 1–1తో ‘డ్రా’ చేసుకున్న భారత్‌ తుది పోరులో మాత్రం పైచేయి సాధించింది.

ఆట 14వ నిమిషంలో అల్‌బలూషి గోల్‌తో కువైట్‌ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 39వ నిమిషంలో లాలియన్‌జులా చాంగ్టే గోల్‌తో భారత్‌ 1–1తో స్కోరును సమం చేసింది. ఆ తర్వాత రెండు జట్లు మరో గోల్‌ చేయలేకపోయాయి. అదనపు సమయంలోనూ స్కోరు సమంగానే ఉంది. దాంతో విజేతను నిర్ణయించడానికి పెనాల్టీ షూటౌట్‌ అనివార్యమైంది. ‘షూటౌట్‌’లో నిరీ్ణత ఐదు షాట్‌ల తర్వాత రెండు జట్లు 4–4తో సమంగా నిలిచాయి. ఆరో షాట్‌లో భారత ప్లేయర్‌ మహేశ్‌ సింగ్‌ గోల్‌ చేయగా... కువైట్‌ ప్లేయర్‌ హజిహా కొట్టిన షాట్‌ను భారత గోల్‌కీపర్‌ గుర్‌ప్రీత్‌ సింగ్‌ సంధూ అడ్డుకోవడంతో టీమిండియా విజయం ఖాయమైంది.

విజేతగా నిలిచిన భారత జట్టుకు 50 వేల డాలర్లు (రూ. 41 లక్షలు), రన్నరప్‌ కువైట్‌ జట్టుకు 25 వేల డాలర్లు (రూ. 20 లక్షల 50 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి.   

9: ‘శాఫ్‌’ చాంపియన్‌షిప్‌ ఇప్పటివరకు 13 సార్లు జరిగింది. భారత్‌ తొమ్మిదిసార్లు (1993, 1997, 1999, 2005, 2009, 2011, 2015, 2021, 2023) టైటిల్‌ సాధించింది.  

24: ‘శాఫ్‌’ చాంపియన్‌షిప్‌ చరిత్రలో అత్యధిక గోల్స్‌ చేసిన ప్లేయర్‌గా సునీల్‌ ఛెత్రి అవతరించాడు. 23 గోల్స్‌తో అలీ అష్ఫాక్‌ (మాల్దీవులు) పేరిట ఉన్న రికార్డును 24 గోల్స్‌తో సునీల్‌ ఛెత్రి అధిగమించాడు.   

‘షూటౌట్‌’ సాగిందిలా...
భారత్‌          స్కోరు     కువైట్‌
సునీల్‌ ఛెత్రి     4    10    అబ్దుల్లా    8
సందేశ్‌ జింగాన్‌     4    21    అలోతైబి    4
లాలియన్‌జులా     4    32     ఆల్దెఫీరి    4
ఉదాంత సింగ్‌     8    33     మహ్రాన్‌    4
సుభాశ్‌ బోస్‌     4    44     అల్ఖాల్ది     4
మహేశ్‌ సింగ్‌     4    54     హజిహా     8

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)