Breaking News

IND Vs AUS: సుందర్‌ విధ్వంసం.. ఆసీస్‌పై టీమిండియా గెలుపు

Published on Sun, 11/02/2025 - 17:28

ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్‌ (Team India) బోణీ కొట్టింది. హోబర్ట్‌ వేదికగా జరిగిన మూడో మ్యాచ్‌లో (India vs Australia) 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. సిరీస్‌లో తొలి మ్యాచ్‌ ఆడిన సుందర్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి ఒంటిచేత్తో టీమిండియాను గెలిపించాడు. ఈ గెలుపుతో భారత్‌ సిరీస్‌లో సమంగా (1-1) నిలిచింది. తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో మ్యాచ్‌లో ఆసీస్‌ విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. టిమ్‌ డేవిడ్‌ (74), స్టోయినిస్‌ (64) విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో చెలరేగారు. ఆఖర్లో మాథ్యూ షార్ట్‌ (26 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. భారత బౌలర్లలో అర్షదీప్‌ సింగ్‌ (Arshdeep Singh) 3 వికెట్లు తీయగా.. వరున్‌ చక్రవర్తి 2, శివమ్‌ దూబే ఓ వికెట్‌ పడగొట్టాడు.

అనంతరం 187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్‌ 18.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. వాషింగ్టన్‌ సుందర్‌ (Washington Sundar) 23 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 49 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 

సుందర్‌కు జితేశ్‌ శర్మ (13 బంతుల్లో 22 నాటౌట్‌; 3 ఫోర్లు) సహకరించాడు. భారత ఇన్నింగ్స్‌లో అభిషేక్‌ శర్మ 25, శుభ్‌మన్‌ గిల్‌ 15, సూర్యకుమార్‌ యాదవ్‌ 24, తిలక్‌ వర్మ 29, అక్షర్‌ పటేల్‌ 17 పరుగులు చేశారు. ఆసీస్‌ బౌలర్లలో నాథన్‌ ఇల్లిస్‌ 3 వికెట్లు పడగొట్టగా.. బార్ట్‌లెట్‌, స్టోయినిస్‌ తలో వికెట్‌ తీశారు. నాలుగో టీ20 గోల్డ్‌ కోస్ట్‌ వేదికగా నవంబర్‌ 6న జరుగుతుంది.

చదవండి: రంజీ క్రికెటర్‌ దుర్మరణం

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)