Breaking News

‘కోహ్లి భవిష్యత్తుపై చర్చ అనవసరం’ 

Published on Tue, 12/02/2025 - 00:44

రాంచీ: భారత స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి మరో అద్భుత ఇన్నింగ్స్‌తో ఆదివారం తనపై వస్తున్న విమర్శలకు సమాధానమిచ్చాడు. గత కొంత కాలంగా జట్టులో కోహ్లి స్థానంపై, 2027 వరల్డ్‌ కప్‌ వరకు ఆడటంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రతీ మ్యాచ్‌లోనూ అతని ప్రదర్శనపై అందరి దృష్టీ నిలుస్తోంది. అయితే ఈ విషయాన్ని భారత బ్యాటింగ్‌ కోచ్‌ సితాన్షు కొటక్‌ ఖండించాడు. కోహ్లి భవిష్యత్తు అనేది అసలు చర్చించాల్సిన అంశమే కాదని అతను స్పష్టం చేశాడు. 

ఇంత బాగా బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో ఇంకేం ఆశిస్తామని కొటక్‌ వ్యాఖ్యానించాడు. ‘కోహ్లి గురించి ఈ తరహాలో ఆలోచించాల్సిన అవసరం ఏముందో నాకు అర్థం కావడం లేదు. అతను చాలా గొప్పగా ఆడుతున్నాడు. అసలు అతని భవిష్యత్తుపై మాట్లాడాల్సిన అవసరం ఏముంది. అతని ఆట, ఫిట్‌నెస్‌ చూస్తే మరో చర్చకు తావు లేదు. కోహ్లి బ్యాటింగ్‌ అసాధారణంగా ఉంది. ఈ జోరు ఇలాగే కొనసాగితే మరో విషయం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు.

 కోహ్లి, రోహిత్‌ ఇద్దరూ జట్టు విజయంలో తమ పాత్ర పోషిస్తున్నారు. వారిద్దరికీ ఎంతో అనుభవం ఉంది. అది జట్టుకు చాలా ఉపయోగపడుతుంది. జట్టు విజయంలో వారి భాగస్వామ్యం కూడా కీలకంగా మారింది’ అని కొటక్‌ భారత్‌ బ్యాటర్లపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. మంచు ప్రభావం కారణంగా తమ బౌలర్లను పట్టు చిక్కలేదని, అందుకే దక్షిణాఫ్రికా కూడా భారీగా పరుగులు సాధించి విజయానికి చేరువగా రాగలిగిందని విశ్లేíÙంచిన కొటక్‌...ఆరంభంలో వికెట్లు తీసి ప్రత్యరి్థని కట్టడి చేసిన హర్షిత్‌ రాణాపై ప్రత్యేకంగా ప్రశంసించాడు.  

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)